Telugu Global
Cinema & Entertainment

శృతిహాస‌న్ అలా క‌మిట‌య్యిందా..!

ఇండ‌స్ట్రీ ఏదైనా..స‌క్సెస్ వుంటేనే  గుర్తింపు.   డేట్స్ కోసం వెయిట్ చేయాలంటే వ‌ర‌స స‌క్సెస్ ల‌తో  ట్రాక్ మీద  జ‌ట్ స్పీడ్ తో ప‌రిగెత్తాల్సిందే.  ఈ విష‌యంలో   శృతిహాస‌న్ ప్ర‌స్తుతం అంద‌రికంటే  ముందు వ‌ర‌స‌లో వుంది.  కెరీర్ ప్రారంభంలో  ప‌లు  ప‌రాజయాలు ఫేస్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌..  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  తో  చేసిన  గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం త‌రువాత‌..  ఐర‌న్ లెగ్ కాస్తా  గోల్డెన్ లెగ్ అయ్యింది. అప్ప‌టి నుంచి  వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం […]

శృతిహాస‌న్ అలా క‌మిట‌య్యిందా..!
X

ఇండ‌స్ట్రీ ఏదైనా..స‌క్సెస్ వుంటేనే గుర్తింపు. డేట్స్ కోసం వెయిట్ చేయాలంటే వ‌ర‌స స‌క్సెస్ ల‌తో ట్రాక్ మీద జ‌ట్ స్పీడ్ తో ప‌రిగెత్తాల్సిందే. ఈ విష‌యంలో శృతిహాస‌న్ ప్ర‌స్తుతం అంద‌రికంటే ముందు వ‌ర‌స‌లో వుంది. కెరీర్ ప్రారంభంలో ప‌లు ప‌రాజయాలు ఫేస్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం త‌రువాత‌.. ఐర‌న్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ అయ్యింది. అప్ప‌టి నుంచి వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ప్ర‌స్తుతానికి అదే రేంజ్ స్పీడ్ కంటిన్యూ అవుతుంది. తెలుగు , త‌మిళ‌, హింది లాంగ్వేజెస్ లో చిత్రాలు చేస్తూ కెరీర్ ప‌రంగా పిచ్చి బిజీగా ఉంది.

క‌ట్ చేస్తే..ఈ మ‌ధ్య పులి చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లొ ఆడియ‌న్స్ ను మెప్పించే రోల్ చేయ‌లేక పోయింది. అయితే కెరీర్ ప‌రంగా త‌ను మాత్రం చాల జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటుంది. స్టార్ డ‌మ్ ఉన్న హీరోల‌తో చేయ‌డానికే క‌మిటైంద‌ట‌. చిన్న హీరోల‌తో చేయ‌న‌ని క్లారీటి ఇచ్చింది. ఎక్క‌డ గ్రాఫ్ ప‌డి పోతుందోన‌నే భ‌య‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదైతేనేమి శృతిహాస‌న్ నిర్ణ‌యం మంచిందే అంటున్నారు ఆమె వీరాభిమానులు. చిన్న హీరోల‌తో న‌టిస్తే ఎక్కువ రెమ్యున్ రేష‌న్ ఆఫ‌ర్ చేసి ఆశ చూపిన నో వే అనేసిందంటే.. శృతి ఏ రేంజ్ లో డెసిష‌న్ తీసుకుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు క‌దా.!

First Published:  8 Dec 2015 7:06 PM GMT
Next Story