Telugu Global
Cinema & Entertainment

చిరు పాలిట రాధికానే విలన్

మెగాస్టార్ చిరంజీవి-రాధిక హిట్ ఫెయిర్ అన్న‌సంగ‌తి తెలిసిందే! రాధిక త‌న కెరీర్‌లో ఎక్కువ సినిమాలు చిరంజీవితోనే చేసింది. అందుకే వీరిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్ర్కీన్ కెమిస్ట్రీ అప్ప‌ట్లో బాగా వ‌ర్క‌వుట‌య్యేది. అంతేకాదు, వీరిద్ద‌రూ బ‌య‌ట కూడా మంచి స్నేహితులు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాధిక‌ను తెలుగులో మ‌ళ్లీ ఎప్పుడు న‌టిస్తారు? అని విలేక‌రులు అడిగారు. వెంట‌నే స్పందించిన రాధిక చిరంజీవి 150వ సినిమాలో చాన్సిస్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇదే విష‌యాన్ని […]

చిరు పాలిట రాధికానే విలన్
X
మెగాస్టార్ చిరంజీవి-రాధిక హిట్ ఫెయిర్ అన్న‌సంగ‌తి తెలిసిందే! రాధిక త‌న కెరీర్‌లో ఎక్కువ సినిమాలు చిరంజీవితోనే చేసింది. అందుకే వీరిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్ర్కీన్ కెమిస్ట్రీ అప్ప‌ట్లో బాగా వ‌ర్క‌వుట‌య్యేది. అంతేకాదు, వీరిద్ద‌రూ బ‌య‌ట కూడా మంచి స్నేహితులు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాధిక‌ను తెలుగులో మ‌ళ్లీ ఎప్పుడు న‌టిస్తారు? అని విలేక‌రులు అడిగారు. వెంట‌నే స్పందించిన రాధిక చిరంజీవి 150వ సినిమాలో చాన్సిస్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇదే విష‌యాన్ని రాధిక ఆల్రెడీ చిరంజీవిని అడిగింద‌ట‌! అందుకు ఆయ‌న మంచి విల‌న్ షేడ్ ఉన్న మ‌హిళ పాత్ర ఉంటే నీకే ఇస్తానంటూ జోక్ చేశార‌ని గుర్తు చేసుకుంది రాధిక‌.
First Published:  8 Dec 2015 7:03 PM GMT
Next Story