Telugu Global
National

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు దుమారం

నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల విక్ర‌యం కేసు మంగ‌ళ‌వారం రాజ‌కీయ దుమారాన్ని రేపింది. ఈ అంశంలో మేజిస్ట్రేటుకు కోర్టుకు సోనియా-రాహుల్ మంగ‌ళ‌వారం గైర్హాజ‌ర‌య్యారు. మేజిస్ట్రేటు కోర్టుకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రుకావ‌డం నుంచి మిన‌హాయింపు కోరుతూ వారిద్ద‌రూవేసిన పిటిష‌న్‌ను హైకోర్టు సోమ‌వారం తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే! దీంతో సోనియా -రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది సింఘ్వీ త‌మ క్ల‌యింట్లు వ్య‌క్తిగ‌త పనుల వ‌ల్ల రాలేక‌పోయార‌ని.. ద‌య‌చేసి మ‌రో తేదీ సూచిస్తే.. త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతార‌ని కోరారు. దీంతో వారి విన‌తిని మ‌న్నించిన న్యాయ‌స్థానం డిసెంబ‌రు […]

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు దుమారం
X
నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల విక్ర‌యం కేసు మంగ‌ళ‌వారం రాజ‌కీయ దుమారాన్ని రేపింది. ఈ అంశంలో మేజిస్ట్రేటుకు కోర్టుకు సోనియా-రాహుల్ మంగ‌ళ‌వారం గైర్హాజ‌ర‌య్యారు. మేజిస్ట్రేటు కోర్టుకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రుకావ‌డం నుంచి మిన‌హాయింపు కోరుతూ వారిద్ద‌రూవేసిన పిటిష‌న్‌ను హైకోర్టు సోమ‌వారం తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే! దీంతో సోనియా -రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది సింఘ్వీ త‌మ క్ల‌యింట్లు వ్య‌క్తిగ‌త పనుల వ‌ల్ల రాలేక‌పోయార‌ని.. ద‌య‌చేసి మ‌రో తేదీ సూచిస్తే.. త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతార‌ని కోరారు. దీంతో వారి విన‌తిని మ‌న్నించిన న్యాయ‌స్థానం డిసెంబ‌రు 19న కోర్టుకు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.
స్తంభించిన ఉభ‌య స‌భ‌లు!
పార్లమెంటు స‌మావేశాలు మొద‌లుకాగానే కాంగ్రెస్ ఎంపీలు అటు లోక్‌స‌భ‌లో, రాజ్య‌స‌భ‌లో రెండు చోట్ల స్పీక‌ర్ పోడియం చుట్టూ చేరి ఆందోళ‌న‌కు దిగారు. బీజేపీ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల‌కు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు నిద‌ర్శ‌న‌మంటూ కాంగ్రెస్ స‌భ్యులు నిర‌స‌న‌కు దిగారు. దీనిపై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి ప్ర‌తాప్ రూడీ స్పందిస్తూ.. దీనికి ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టంచేశారు. ప‌లుమార్లు లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ చేసిన విన‌తిని కాంగ్రెస్ స‌భ్యులు వినిపించుకోలేదు. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే గంద‌ర‌గోళం నెలకొంది. కురియ‌న్ , అన్సారీలు ఎంత స‌ర్దిచెప్పినా, స‌భ‌ను నాలుగుసార్లు వాయిదావేసినా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. దీంతో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు బుధ‌వారానికి వాయిదాప‌డ్డాయి.
ప్ర‌తీకార చ‌ర్య‌లే:
ఈ కేసు బీజేపీ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో రాహుల్ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సోనియాగాంధీ మాట్లాడుతూ నేను ఇందిరాగాంధీ కోడ‌లిన‌ని ఇలాంటి కేసులతో నన్ను ఎవరూ బెదిరించ‌లేర‌ని స్ప‌ష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు అరుణ్‌జైట్లీ ఖండించారు. ఈ విష‌యాన్ని న్యాయ‌స్థానంలో తేల్చుకోవాల‌ని సూచించారు. దోషులెవ‌రో.. నిర‌ప‌రాధులెవ‌రో తేల్చాల్సింది పార్ల‌మెంటు, మీడియా కాద‌ని గుర్తు చేశారు.
First Published:  8 Dec 2015 11:54 PM GMT
Next Story