Telugu Global
Cinema & Entertainment

నాన్నకు ప్రేమతో షూటింగ్ ఆగనుందా ?

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న నాన్న‌కు ప్రేమ‌తో సినిమా గురించి ఓ హాటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం సినిమా స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అంత‌క‌ముందు చిత్రం షూటింగ్‌ను 90 రోజుల‌పాటు లండ‌న్లో జ‌రిపారు. సినిమా క‌థ‌ను బ‌ట్టి రిచ్ లుక్ కోసం సుకుమార్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో సినిమా బ‌డ్జెట్ త‌డిసి మోపెడైంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నిర్మాత బీవీ ఎస్ ఎన్ ప్ర‌సాద్‌. తొలుత సినిమాకు రూ.40కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు […]

నాన్నకు ప్రేమతో షూటింగ్ ఆగనుందా ?
X
జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న నాన్న‌కు ప్రేమ‌తో సినిమా గురించి ఓ హాటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం సినిమా స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అంత‌క‌ముందు చిత్రం షూటింగ్‌ను 90 రోజుల‌పాటు లండ‌న్లో జ‌రిపారు. సినిమా క‌థ‌ను బ‌ట్టి రిచ్ లుక్ కోసం సుకుమార్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో సినిమా బ‌డ్జెట్ త‌డిసి మోపెడైంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నిర్మాత బీవీ ఎస్ ఎన్ ప్ర‌సాద్‌. తొలుత సినిమాకు రూ.40కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌నుకున్నారు. అయితే ఇప్ప‌టికే రూ.48 కోట్లు దాటిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా వ్య‌యం మితిమీరిపోవ‌డంతో ఇక నేను డ‌బ్బులు పెట్ట‌లేన‌ని ప్ర‌సాద్ చేతులెత్తేశాడ‌ట‌.
నేనున్నాన‌ని.. నీకేం కాద‌ని!
సినిమాపై న‌మ్మ‌కంతో ఎన్టీఆర్ నిర్మాత ప్ర‌సాద్‌కు భ‌రోసా ఇచ్చాడ‌ట‌. అంతేకాదు, త‌న సొంత డ‌బ్బులతో ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రిపిస్తున్నాడ‌ట‌. డ‌బ్బు గురించి మీరేం వ‌ర్రీ కావ‌ద్ద‌ని చెప్ప‌డంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నాడ‌ని తెలిసింది. అంతేకాదు, కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి ముంద‌స్తుగా అడ్వాన్సు డ‌బ్బులను ప్ర‌సాద్‌కు ఇప్పించే ఏర్పాటు చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమా క్వాలిటీలో తేడా రాకూడ‌ద‌న్న త‌ప‌న‌తో ఎన్టీఆర్ ఇదంతా చేస్తున్నాడ‌ట‌. ఇలాంటి హీరో దొర‌క‌డంతో ప్ర‌సాద్‌కు కొండంత ఊర‌ట ల‌భించింది.
First Published:  8 Dec 2015 7:02 PM GMT
Next Story