Telugu Global
Cinema & Entertainment

ఆగని మహేష్ దూకుడు

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు రూ.50 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గగ‌నంగా ఉండేది. అలాంటిది బాహుబ‌లి, శ్రీ‌మంతుడు, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను దాటి ఔరా! అనిపించాయి. ఈ విజ‌యాలు ఇచ్చిన స్ఫూర్తితో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ ఇప్పుడు రూ.200 కోట్లు కొల్ల‌గొట్టాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. శ్రీ‌మంతుడు సినిమా బ‌డ్జెట్ కేవ‌లం రూ.40 కోట్లు. కానీ, దాదాపు రూ.150 కోట్లు వ‌ర‌కు వ‌సూలు చేసింది. ప్రిన్స్ త‌రువాత చిత్రం ద్వారా రూ.200 కోట్ల మార్కు […]

ఆగని మహేష్ దూకుడు
X

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు రూ.50 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గగ‌నంగా ఉండేది. అలాంటిది బాహుబ‌లి, శ్రీ‌మంతుడు, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను దాటి ఔరా! అనిపించాయి. ఈ విజ‌యాలు ఇచ్చిన స్ఫూర్తితో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ ఇప్పుడు రూ.200 కోట్లు కొల్ల‌గొట్టాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. శ్రీ‌మంతుడు సినిమా బ‌డ్జెట్ కేవ‌లం రూ.40 కోట్లు. కానీ, దాదాపు రూ.150 కోట్లు వ‌ర‌కు వ‌సూలు చేసింది. ప్రిన్స్ త‌రువాత చిత్రం ద్వారా రూ.200 కోట్ల మార్కు చేరుకుని త‌న మార్కెట్‌ను మ‌రింత పెంచుకోవాల‌ని ఆశిస్తున్నాడ‌ని తెలిసింది.

పారితోషిక‌మే పెట్టుబ‌డిగా..!
మ‌హేష్‌ త‌న త‌రువాత చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌తో చేయ‌నున్నాడు. ఈ సినిమా 2016 ఏప్రిల్‌లో ప‌ట్టాలెక్క‌నుంది. అంటే ప్ర‌స్తుతం మ‌హేష్‌ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం సినిమా విడుద‌ల త‌రువాత ఈ చిత్ర షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఇది ద్వి భాషా చిత్రం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నారు. సినిమా క‌థ‌ను బ‌ట్టి స‌రాస‌రిగా రూ.100 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా! పైగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కావ‌డంతో నిర్మాత‌లు సైతం అంగీక‌రించార‌ట‌. మ‌రి రూ.100 కోట్లు పెడుతున్న‌పుడు క‌నీసం రూ.200 కోట్ల‌యినా రాక‌పోతే ఎలా? అందుకే మ‌హేష్‌ సినిమాను ఆ స్థాయిలో తీర్చిదిద్దేందుకు మురుగ‌దాస్‌కు సంపూర్ణంగా స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మైపోయాడ‌ట‌. ఇందుకోసం త‌న వంతు పారితోషికాన్ని సినిమాలో పెట్టుబ‌డిగా పెట్టేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. శ్రీ‌మంతుడు సినిమాలోనూ మ‌హేష్‌ కొంత పెట్టుబ‌డి పెట్టాడు. ఆ లెక్క‌న ఈ సినిమా కూడా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ప్రిన్స్ ధీమాగా ఉన్నాడ‌ని తెలిసింది.

Next Story