Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ నుంచి పవన్ అలిగి వెళ్ళిపోయాడా ?

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాను ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మూహుర్తాన మొద‌లు పెట్టాడో గానీ, సినిమాపై ఎప్పుడూ ఏదో రూమ‌ర్ వ‌స్తూనే ఉంది. అప్ప‌ట్లో ఈ చిత్రం షూటింగ్ బాగా నెమ్మ‌దిగా న‌డుస్తోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఒక సంద‌ర్భంలో అస‌లు చిత్రం షూటింగ్ నిలిచిపోయింద‌ని వదంతులు రేగాయి. వీట‌న్నింటికీ ప‌వ‌న్‌- ద‌ర్శ‌కుడు బాబీ మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం వ‌ల్లేన‌ని అంతా అనుకున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఆ మ‌ధ్య వేగంగా సాగింది. ల‌క్ష్మీరాయ్ తో […]

షూటింగ్ నుంచి పవన్ అలిగి వెళ్ళిపోయాడా ?
X

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాను ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మూహుర్తాన మొద‌లు పెట్టాడో గానీ, సినిమాపై ఎప్పుడూ ఏదో రూమ‌ర్ వ‌స్తూనే ఉంది. అప్ప‌ట్లో ఈ చిత్రం షూటింగ్ బాగా నెమ్మ‌దిగా న‌డుస్తోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఒక సంద‌ర్భంలో అస‌లు చిత్రం షూటింగ్ నిలిచిపోయింద‌ని వదంతులు రేగాయి. వీట‌న్నింటికీ ప‌వ‌న్‌- ద‌ర్శ‌కుడు బాబీ మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం వ‌ల్లేన‌ని అంతా అనుకున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఆ మ‌ధ్య వేగంగా సాగింది. ల‌క్ష్మీరాయ్ తో క‌లిసి ప‌వ‌న్ స్టెప్పులేసిన ఓ గీతానికి సంబంధించిన‌ చిత్రాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ పుకార్లేన‌ని ప‌వ‌న్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది మ‌రో వార్త‌!
తాజాగా సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతోంద‌ని ప‌వ‌న్ ద‌ర్శ‌కుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ని మ‌రో కొత్త‌ రూమ‌ర్ మొద‌లైంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ బాబీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడ‌ని, అందుకే ఒక‌సారి షూటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌ లాడుకుంటున్నారు. అయితే, ఇవ‌న్నీ వ‌దంతులేన‌ని చిత్ర యూనిట్ కొట్టిపారేస్తోంది. అలాంటి సంఘ‌ట‌న‌లేమీ జ‌ర‌గ‌లేదని స్ప‌ష్టం చేస్తోంది. ఇటీవ‌ల ఇలాంటి రూమ‌ర్లు వ‌చ్చిన‌పుడు ఐటెంసాంగ్ చిత్రాలు రిలీజ్ చేసిన‌ట్లే.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో అప్‌డేట్‌ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. 2016 మార్చిలో విడుద‌ల ఖ‌రారు చేసుకున్న ఈ చిత్రం ఇంకెన్ని గండాలు దాటాల్సి ఉందో!

Next Story