Telugu Global
Others

అమరావతిలో అర్థరాత్రి అధికారుల అరాచకం..!

గుంటూరు జిల్లా లింగాయపాలెంలో సీఆర్‌డీఏ అధికారులు చేయకూడని పనిచేశారు. ఆర్థరాత్రి పొలాల్లోకి వెళ్లి పచ్చటి అరటి పంటను దున్నేశారు. ఏడున్నర ఎకరాల్లోని పంటను తెల్లవారేసరికి దున్ని ధ్వంసం చేశారు. ఉదయం పొలానికి వెళ్లి చూసుకున్న రైతుకు గుండెపగిలినంత పనైంది. రాజధానికి భూమి ఇవ్వలేదన్న కుట్రతోనే అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టారని రైతు ఆరోపిస్తున్నారు. లింగాయపాలెనికి చెందిన రైతు గుండా రాజేష్ ఏడున్నర ఎకరాల్లో అరటి పంట సాగుచేశారు. అయితే ఈ భూమిని ల్యాండ్ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి వెళ్లి పంటను సీఆర్‌డీఏ […]

అమరావతిలో అర్థరాత్రి అధికారుల అరాచకం..!
X

గుంటూరు జిల్లా లింగాయపాలెంలో సీఆర్‌డీఏ అధికారులు చేయకూడని పనిచేశారు. ఆర్థరాత్రి పొలాల్లోకి వెళ్లి పచ్చటి అరటి పంటను దున్నేశారు. ఏడున్నర ఎకరాల్లోని పంటను తెల్లవారేసరికి దున్ని ధ్వంసం చేశారు. ఉదయం పొలానికి వెళ్లి చూసుకున్న రైతుకు గుండెపగిలినంత పనైంది. రాజధానికి భూమి ఇవ్వలేదన్న కుట్రతోనే అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టారని రైతు ఆరోపిస్తున్నారు. లింగాయపాలెనికి చెందిన రైతు గుండా రాజేష్ ఏడున్నర ఎకరాల్లో అరటి పంట సాగుచేశారు. అయితే ఈ భూమిని ల్యాండ్ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి వెళ్లి పంటను సీఆర్‌డీఏ సిబ్బంది దున్నేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పక్క పొలాన్ని చదును చేయబోయి పొరపాటును అరటితోటను దున్నేశామని కామెడీగా సమాధానం చెబుతున్నారు. రాజేష్ మాత్రం ల్యాండ్‌ పూలింగ్‌కు భూమి ఇవ్వలేదన్న కక్షతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First Published:  9 Dec 2015 5:19 AM GMT
Next Story