Telugu Global
Cinema & Entertainment

మార్చిలో మున్నాభాయ్ కి విముక్తి

 ఎర్ర‌వాడ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే మార్చి మొదటివారంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్‌ దత్‌ ఇప్పటికే పలుమార్లు పెరోల్‌ మీద బయటకు వచ్చి […]

మార్చిలో మున్నాభాయ్ కి విముక్తి
X
ఎర్ర‌వాడ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే మార్చి మొదటివారంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్‌ దత్‌ ఇప్పటికే పలుమార్లు పెరోల్‌ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. బాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒక్కరైన సంజయ్‌దత్ ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్‌’, ‘ఖల్‌నాయక్‌’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారు. అయితే సెకండ్ టెర్మె జైలు కు వ‌చ్చిన సంజుభాయ్ కి.. ఏదో రూపంలో మ్యాగ్జిమ‌మ్ వెసులు బాటును జైలు అధికారులు ఇస్తున్న విష‌యం తెలిసిందే. వైఫ్ కు ఆరోగ్యం బాగ‌లేద‌ని కొంత కాలం.. ఆయ‌నకు ఆరోగ్యం బాగాలేద‌ని మ‌రొ కొన్ని సార్లు.. పిల్ల‌ల హెల్త్ బాగ‌లేద‌ని మ‌రి కొన్ని సార్లు.. ఇలా సాధ్య‌మైనంత వ‌ర‌కు సంజు భాయ్ కుటుంబంతో గ‌డుపుతున్నారు.

Next Story