Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మీ స్థానం ఆక్రమిస్తున్న పృథ్వి?

థర్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనే మాటని పాపులర్ చేసిన పృథ్వీకి ఇటీవలి కాలం వరకు మరీ పెద్ద గుర్తింపేమీ లేదు.. కాని 2014-15 అతడి సినీ కెరియర్‌ని పెద్ద మలుపే తిప్పింది. ఒకప్పుడు బ్రహ్మానందం కొన్ని సినిమాలను తన భుజాలపై నడిపించడం మనకు తెలుసు. కొన్ని సినిమాల సెకండ్ హాఫ్ అంతా బ్రహ్మీ అయి నడిపించి.. సక్సెస్ చేసాడు. అదీ అతని స్టామినా. కాని కొత్త నీరొచ్చి పాత నీరు వెళ్ళిపోయినట్లు, బ్రహ్మీ స్థానం ప్రస్తుతం […]

బ్రహ్మీ స్థానం ఆక్రమిస్తున్న పృథ్వి?
X

థర్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనే మాటని పాపులర్ చేసిన పృథ్వీకి ఇటీవలి కాలం వరకు మరీ పెద్ద గుర్తింపేమీ లేదు.. కాని 2014-15 అతడి సినీ కెరియర్‌ని పెద్ద మలుపే తిప్పింది. ఒకప్పుడు బ్రహ్మానందం కొన్ని సినిమాలను తన భుజాలపై నడిపించడం మనకు తెలుసు. కొన్ని సినిమాల సెకండ్ హాఫ్ అంతా బ్రహ్మీ అయి నడిపించి.. సక్సెస్ చేసాడు. అదీ అతని స్టామినా. కాని కొత్త నీరొచ్చి పాత నీరు వెళ్ళిపోయినట్లు, బ్రహ్మీ స్థానం ప్రస్తుతం పృథ్వి బర్తీ చేస్తున్నాడు అనిపిస్తుంది. అతని అతి చిన్న రోల్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైనా ‘శౌర్యం’ ట్రైలర్ చివరలో.. పృథ్వి బాహుబలి శివుడిలా (ప్రభాస్) శివలింగం ఎత్తే సీన్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఎవ్వరంట ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ పాట వస్తుంటే… పృథ్వి శివలింగం మోసే సీన్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘శంకరాభరణం’ వంటి విషయంలేని సినిమాలో పృథ్వి కామెడీ ఒక్కటే సినిమాను ఈ మాత్రం నడిపిస్తోంది అనే టాక్ సర్వత్రా వినపడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

Next Story