Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ల‌కు పొగ‌బెడుతున్న హెబా!

కుమారి 21-ఎఫ్ సాధించిన విజ‌యం హీరోయిన్ హెబా ప‌టేల్‌కు మంచి పేరు తీసుకువ‌చ్చింది. రొమాంటిక్ హీరోయిన్‌గా గుర్తింపునూ తెచ్చిపెట్టింది. హెబాపై రొమాంటిక్ ముద్ర ప‌డ‌టంతో ఈ ముద్దుగుమ్మ‌కు అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు ఇత‌ర హీరోయిన్ల అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసేలా ఉంది. విష‌య‌మేంటంటే.. కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో-హీరోయిన్లుగా తొలుత రాజ్ త‌రుణ్‌- అవికా గోర్‌ను అనుకున్నారు. సుకుమారిలో రాజ్‌త‌రుణ్‌- హెబాల మ‌ధ్య కెమిస్ట్రీ […]

హీరోయిన్ల‌కు పొగ‌బెడుతున్న హెబా!
X
కుమారి 21-ఎఫ్ సాధించిన విజ‌యం హీరోయిన్ హెబా ప‌టేల్‌కు మంచి పేరు తీసుకువ‌చ్చింది. రొమాంటిక్ హీరోయిన్‌గా గుర్తింపునూ తెచ్చిపెట్టింది. హెబాపై రొమాంటిక్ ముద్ర ప‌డ‌టంతో ఈ ముద్దుగుమ్మ‌కు అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు ఇత‌ర హీరోయిన్ల అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసేలా ఉంది. విష‌య‌మేంటంటే.. కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో-హీరోయిన్లుగా తొలుత రాజ్ త‌రుణ్‌- అవికా గోర్‌ను అనుకున్నారు. సుకుమారిలో రాజ్‌త‌రుణ్‌- హెబాల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుద‌ర‌డంతో అవికా స్థానంలో హెబాను తీసుకున్న‌ట్లు టాక్‌! అంతేకాదు, ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.
ఇతరుల‌కు గుబులే!
ఇటీవ‌ల రూ.కోటి ఇచ్చినా.. నేను ఎక్స్‌పోజింగ్ చేయ‌నంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది అవికా. ఈ వ్యాఖ్య‌లు చేసి వారం తిర‌క్క‌ముందే అవి ఆమె అవ‌కాశాల‌ను దెబ్బ తీశాయి. త‌న‌కున్న ఫాలోయింగ్‌కు స్కిన్ షో చేస్తే అభిమానులు బాధ‌ప‌డతార‌ని వాపోయిన ఈ చిన్న‌ది ఇప్పుడు హెబా దెబ్బ‌కు ఆలోచ‌న‌లో ప‌డింద‌ని తెలిసింది. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్లు ఇర‌గ‌దీసిన హెబాకు అవ‌కాశాలు తలుపు త‌డుతుంటే.. ఇత‌ర హీరోయిన్లు మాత్రం హెబాపై క‌డుపుమంట‌తో ర‌గిలిపోతున్నార‌ని తెలిసింది. చాలా మంది నిర్మాత‌లు తాము ఇప్ప‌టికే అనుకున్న హీరోయిన్ల‌ను త‌ప్పించి మ‌రీ హెబాను తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా హెబాతో మ‌రో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే!
Next Story