Telugu Global
Cinema & Entertainment

అ.. ఆ.. నుంచి త‌ప్పుకున్న విశ్వ‌నాథ్‌

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ స‌మంత జంట‌గా తెర‌కెక్కిస్తోన్న సినిమా అ..ఆ! ఈ సినిమా గురించి మ‌రో రూమ‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చానీయాంశ‌మైంది. సినిమాలో కీల‌క‌పాత్ర‌కు ఒప్పుకున్న విశ్వ‌నాథ్ అర్ధాంత‌రంగా ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నార‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న వారిలో విశ్వ‌నాథ్ రెండోవాడవుతారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తీరుతో ఆర్ట్ డైరెక్ట‌ర్ త‌ప్పుకోవాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే! అయితే, క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ స్వ‌యంగా త‌ప్పుకుంటాన‌న‌డం వెన‌క కార‌ణాలు ఏమై ఉంటాయా? అని సినీజ‌నాలు […]

అ.. ఆ.. నుంచి త‌ప్పుకున్న విశ్వ‌నాథ్‌
X
త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ స‌మంత జంట‌గా తెర‌కెక్కిస్తోన్న సినిమా అ..ఆ! ఈ సినిమా గురించి మ‌రో రూమ‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చానీయాంశ‌మైంది. సినిమాలో కీల‌క‌పాత్ర‌కు ఒప్పుకున్న విశ్వ‌నాథ్ అర్ధాంత‌రంగా ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నార‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న వారిలో విశ్వ‌నాథ్ రెండోవాడవుతారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తీరుతో ఆర్ట్ డైరెక్ట‌ర్ త‌ప్పుకోవాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే! అయితే, క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ స్వ‌యంగా త‌ప్పుకుంటాన‌న‌డం వెన‌క కార‌ణాలు ఏమై ఉంటాయా? అని సినీజ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఫైనాన్స్ టీం త‌ప్పిద‌మే!
సినిమాలో క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ ను ఏరికోరి ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. క‌థ కూడా వినిపించి ఆయ‌న్ని ఒప్పించాడు. తీరా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఫైనాన్స్ టీం- విశ్వ‌నాథ్‌కు మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్ రావ‌డం వ‌ల్ల విశ్వ‌నాథ్ నొచ్చుకున్నార‌ని తెలిసింది. ఈ ఘ‌ట‌న‌తో మ‌న‌స్తాపం చెందిన విశ్వ‌నాథ్ ఈ సినిమా చేయ‌న‌న్నార‌ని టాక్‌! దీంతో చేసేదిలేక ఈ పాత్ర‌కు గిరిబాబుకు ఎంచుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే విశ్వ‌నాథ్ పాత్ర‌లో గిరిబాబు ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం.! ఈ రూమ‌ర్ల‌ను చిత్ర యూనిట్ ఇంకా నిర్ధారించ‌లేదు.
First Published:  4 Dec 2015 9:00 PM GMT
Next Story