Telugu Global
Cinema & Entertainment

క్రిష్ రాయ‌బారి వ‌రుణేనా?

తెలుగులో వైవిధ్యమైన‌ క‌థ‌ల‌తో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీస్తున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఇటీవ‌ల అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కంచె సినిమా భారీ హిట్ సాధించిన విష‌యం తెలిసిందే! దీంతో క్రిష్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టు ఎవ‌రితో చేస్తాడ‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. క్రిష్ ప్రాజెక్టులో అఖిల్ హీరోగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రికొంద‌రు కుర్ర‌హీరోల పేర్లూ వినిపించాయి. వీటిలో ఏదీ ఇంత‌వ‌ర‌కూ క‌న్ఫర్మ్ కాలేదు. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న క్రిష్ తో సినిమాలు చేసుందుకు యువ హీరోలంతా […]

క్రిష్ రాయ‌బారి వ‌రుణేనా?
X
తెలుగులో వైవిధ్యమైన‌ క‌థ‌ల‌తో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీస్తున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఇటీవ‌ల అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కంచె సినిమా భారీ హిట్ సాధించిన విష‌యం తెలిసిందే! దీంతో క్రిష్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టు ఎవ‌రితో చేస్తాడ‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. క్రిష్ ప్రాజెక్టులో అఖిల్ హీరోగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రికొంద‌రు కుర్ర‌హీరోల పేర్లూ వినిపించాయి. వీటిలో ఏదీ ఇంత‌వ‌ర‌కూ క‌న్ఫర్మ్ కాలేదు. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న క్రిష్ తో సినిమాలు చేసుందుకు యువ హీరోలంతా క్యూలో ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే! వారంద‌రినీ కాద‌ని క్రిష్ మ‌ళ్లీ వ‌రుణ్‌తేజ్‌తోనే సినిమా తీయ‌నున్న‌ట్లు స‌మాచారం. కంచె సినిమాలో వ‌రుణ్ ఫ‌ర్మామెన్స్ నచ్చిన ద‌ర్శ‌కుడు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.
రాయ‌బారి క‌థ వినిపించాడా?
క్రిష్ కొత్త ప్రాజెక్టు పేరు రాయ‌బారి అని, ఇందులో హీరో వ‌రుణ్ తేజ్ అన్న గుస‌గుస‌లు బ‌య‌ల్దేరాయి. ఇప్ప‌టికే వ‌రుణ్‌, నాగ‌బాబులు ఈ క‌థ‌ను విన్నార‌ని టాక్‌. త‌న కెరీర్‌లో మ‌రిచిపోలేని హిట్ ఇచ్చిన క్రిష్‌తో మ‌రోసారి సినిమా చేసేందుకు వ‌రుణ్ సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. తెలుగుతెర‌పై ఆ మాట‌కొస్తే.. భార‌తీయ భాష‌ల్లో రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో కంచె లాంటి కాన్సెప్ట్ రాక‌పోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. రాయ‌బారి క‌థ కూడా సందేశాత్మ‌క చిత్ర‌మేన‌ట‌! ఈ సినిమాలో కూడా న‌ట‌న‌కు 100 శాతం అవ‌కాశ‌మున్న పాత్ర వ‌రుణ్ కోసం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ ప్రాజెక్టు ఎప్ప‌టిలోగా ప‌ట్టాలెక్కుతుంద‌న్న‌ది క్రిష్ ప్ర‌క‌టించాల్సి ఉంది.
First Published:  3 Dec 2015 7:03 PM GMT
Next Story