Telugu Global
Cinema & Entertainment

స‌ల్మాన్ చెల్లి కాపురంలో యామి చిచ్చు!

స‌ల్మాన్‌ఖాన్ చెల్లెలి కాపురంలో యామిగౌత‌మ్ చిచ్చుపెట్టిందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. యామిగౌత‌మ్ కార‌ణంగా శ్వేత‌రోహిరా- పుల్కిత్ సామ్రాట్‌ల వివాహం త్వ‌ర‌లోనే ర‌ద్దు కానుంద‌ని, వీరిద్ద‌రూ ఇప్పుడు విడాకుల వైపు చూస్తున్నార‌న్న వార్త సంచ‌ల‌నంగా మారింది. శ్వేత‌రోహిరా- పుల్కిత్ సామ్రాట్‌లిద్ద‌రూ బాల్య‌మిత్రులు. గ‌తేడాది న‌వంబ‌రులో వీరిద్ద‌రి వివాహం గోవాలో ఘ‌నంగా జ‌రిగింది. ఏడాది స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఏం జ‌రిగిందో? ఏమో ?  తెలియ‌దు కానీ, వీరిద్ద‌రూ ఇప్పుడు విడాకుల కావాలంటున్నారు. బాలీవుడ్ లో అప్‌క‌మింగ్ హీరో […]

స‌ల్మాన్ చెల్లి కాపురంలో యామి చిచ్చు!
X
స‌ల్మాన్‌ఖాన్ చెల్లెలి కాపురంలో యామిగౌత‌మ్ చిచ్చుపెట్టిందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. యామిగౌత‌మ్ కార‌ణంగా శ్వేత‌రోహిరా- పుల్కిత్ సామ్రాట్‌ల వివాహం త్వ‌ర‌లోనే ర‌ద్దు కానుంద‌ని, వీరిద్ద‌రూ ఇప్పుడు విడాకుల వైపు చూస్తున్నార‌న్న వార్త సంచ‌ల‌నంగా మారింది. శ్వేత‌రోహిరా- పుల్కిత్ సామ్రాట్‌లిద్ద‌రూ బాల్య‌మిత్రులు. గ‌తేడాది న‌వంబ‌రులో వీరిద్ద‌రి వివాహం గోవాలో ఘ‌నంగా జ‌రిగింది. ఏడాది స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఏం జ‌రిగిందో? ఏమో ? తెలియ‌దు కానీ, వీరిద్ద‌రూ ఇప్పుడు విడాకుల కావాలంటున్నారు. బాలీవుడ్ లో అప్‌క‌మింగ్ హీరో అయిన పుల్కిత్ కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగానే తాను విడాకులు కోరుకుంటున్న‌ట్లు చెబుతున్నాడు. అయితే. దానివెన‌క అస‌లు కార‌ణం యామినేని బాలీవుడ్ కోడై కూస్తోంది.
సల్మాన్ మాట నిల‌బెట్టుకుంటాడా?
స‌ల్మాన్ ఖాన్‌కు శ్వేత రాఖీ క‌ట్టిన చెల్లెలుగా బాలీవుడ్‌లో ప్ర‌తీతి. అంతేకాదు, ఈ వివాహానికి హాజ‌రైన స‌ల్మాన్ స్వ‌యంగా క‌న్యాదానం చేయ‌డం విశేషం. జీవితంలో ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని స‌ల్మాన్ ప్రామిస్ కూడా చేశాడ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం స‌ల్మాన్ దాకా చేరింద‌ని తెలిసింది. స‌ల్మాన్ వీరిద్ద‌రిని క‌లిపేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. మ‌రి స‌ల్మాన్ మాట‌ను దంప‌తులు విని క‌లిసి ఉంటారా? లేదా పంతాల‌కు పోయి, పెళ్లిని ర‌ద్దు చేసుకుంటారా? అన్న‌ది బాలీవుడ్‌లో ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
First Published:  3 Dec 2015 7:05 PM GMT
Next Story