Telugu Global
Cinema & Entertainment

సాయి షూటింగ్స్ లోను వదలని ఆభామ ఎవరు?

మెగా క్యాంప్ నుంచి గ‌తేడాది తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన మ‌రో హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్. తొలి చిత్రం రేయ్ నిరాశ‌ప‌రిచినా.. త‌రువాత వ‌చ్చిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలతో విజ‌యం రుచి చ‌వి చూశాడు. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం ఖాళీ లేదు. మ‌రి ఇంత బిజీగా ఉన్న హీరో గురించి ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ బ‌య‌ల్దేరింది. అదే ఓ కుర్ర హీరోయిన్‌తో సాయి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని! ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్నా.. ఈ […]

సాయి షూటింగ్స్ లోను వదలని ఆభామ ఎవరు?
X

మెగా క్యాంప్ నుంచి గ‌తేడాది తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన మ‌రో హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్. తొలి చిత్రం రేయ్ నిరాశ‌ప‌రిచినా.. త‌రువాత వ‌చ్చిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలతో విజ‌యం రుచి చ‌వి చూశాడు. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం ఖాళీ లేదు. మ‌రి ఇంత బిజీగా ఉన్న హీరో గురించి ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ బ‌య‌ల్దేరింది. అదే ఓ కుర్ర హీరోయిన్‌తో సాయి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని! ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్నా.. ఈ కుర్ర జంట గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఎవ‌రూ బ‌య‌టికి చెప్పే సాహ‌సం చేయ‌డం లేదు!

న‌చ్చ‌జెపుతున్న అల్లు!
సాయి కేవ‌లం ప్రేమ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేద‌ని, ఆకుర్ర హీరోయిన్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడ‌న్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొంత‌కాలంగా సాయి షూటింగ్ స్పాట్‌ల‌లోనూ వీరిద్ద‌రూ త‌ర‌చుగా క‌లుసుకుంటున్నారట‌. ఇటీవ‌ల జ‌రిగిన సాయి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఆ హీరోయిన్ బాగా సంద‌డి చేసింద‌ట‌. దీంతో వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఇంటి వ‌ర‌కు చేరింది. విష‌యం తెలుసుకున్న అల్లు అర‌వింద్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రేమ‌-గీమా ప‌క్క‌కి పెట్టి కెరీర్ మీద దృష్టి పెట్ట‌మ‌ని సాయికి న‌చ్చ‌జెపుతున్నాడ‌ట‌.

First Published:  3 Dec 2015 3:01 AM GMT
Next Story