Telugu Global
International

కూతురు పుట్టిందన్న సంతోషం... 3లక్షల కోట్లు దానం

కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్ లో తనకు ఉన్న షేర్లలో 99శాతం షేర్లను దానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకుతన కూతురు మ్యాక్స్ చాన్ జుకర్‌ బర్గ్‌కు ఫేస్ బుక్ ద్వారా జుకర్ దంపతులు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో  జుకర్ బర్గ్ తన ఆలోచనా విధానాన్ని, సేవ చేయాలన్న ఆలోచనను వెల్లడించారు. తన నిర్ణయం చాలా మంచి జీవితాలకి […]

కూతురు పుట్టిందన్న సంతోషం... 3లక్షల కోట్లు దానం
X
కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్ లో తనకు ఉన్న షేర్లలో 99శాతం షేర్లను దానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకుతన కూతురు మ్యాక్స్ చాన్ జుకర్‌ బర్గ్‌కు ఫేస్ బుక్ ద్వారా జుకర్ దంపతులు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో జుకర్ బర్గ్ తన ఆలోచనా విధానాన్ని, సేవ చేయాలన్న ఆలోచనను వెల్లడించారు. తన నిర్ణయం చాలా మంచి జీవితాలకి ఆర్థిక ఆసరాని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫేస్ బుక్ లో జుకర్ బర్గ్ కు ఉన్న షేర్ల విలువలో 99 శాతం షేర్లను దానం చేయడం అంటే తాజా విలువ ప్రచారం సుమారు 3లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రేపటి పౌరుల కోసం, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. మనుషుల మధ్య సమానత్వాన్ని పెంచడానికి, ఆరోగ్యం, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, పేదరికంపై పోరుకుతోపాటు మరిన్ని మంచి పనులకు ఈ డబ్బు ఉపయోగపడాలని జుకర్‌బెర్గ్ ఆకాంక్షించారు.
ఇందుకోసం తన కూతురు ‘చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్’ పేరుతో సేవా సంస్థని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సంస్థ ఉద్దేశం మానవ శక్తి సామర్థ్యాలను పెంచడం, సమానత్వమేనని రాశారు. జుకర్ బర్గ్ కు వారం క్రితమే ఆడపిల్ల పుట్టింది. ఆమెకు మ్యాక్స్ చాన్ జుకర్ బర్గ్ అని పేరు పెట్టుకున్నారు. రెండు నెలల పాటు తాను ప్రిస్కిల్లా మ్యాటర్నిటీ, పేటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్టు ఇదివరకే ప్రకటించారు. లీవ్‌ల నుంచి తిరిగి వచ్చాక విరాళానికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుతామని ఫేస్ బుక్ లో రాసిన లేఖలో తెలిపారు.
First Published:  2 Dec 2015 12:34 AM GMT
Next Story