Telugu Global
Others

కుంగుతున్న రామప్ప టెంపుల్ శివ లింగం

కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప టెంపుల్‌ రానురాను దెబ్బతింటోంది. పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలోని శివ లింగం ఒక వైపుకు కుంగిపోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలో రామప్ప టెంపుల్ ఉంది. 1213లో రేచర్ల రుద్రుడు ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు. అడుగుభాగంలో ఇసుకను నింపి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శివలింగానికి చేసే అభిషేకాల జలాలు బయటకు వెళ్లేలా అప్పట్లోనే సోమసూత్రం అనే ప్రత్యేక రంద్రాన్ని […]

కుంగుతున్న రామప్ప టెంపుల్ శివ లింగం
X
shiava-1
ఆలయంలో నిలిచిపోయిన అభిషేక జలాలు

కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప టెంపుల్‌ రానురాను దెబ్బతింటోంది. పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలోని శివ లింగం ఒక వైపుకు కుంగిపోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలో రామప్ప టెంపుల్ ఉంది. 1213లో రేచర్ల రుద్రుడు ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు. అడుగుభాగంలో ఇసుకను నింపి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శివలింగానికి చేసే అభిషేకాల జలాలు బయటకు వెళ్లేలా అప్పట్లోనే సోమసూత్రం అనే ప్రత్యేక రంద్రాన్ని ఏర్పాటు చేశారు. నీరు శివలింగం కిందకు వెళ్తే కుంగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంలో అప్పట్లోనే ఈ రంధ్రం ఏర్పాటు చేశారు. కానీ సోమసూత్రం రంధ్రం చాలా ఏళ్ల క్రితమే మూసుకుపోయింది.

shiava-2
పునాదుల్లో ఇసుకను తోడుతున్న చీమలు

సోమసూత్రాన్ని పునరుద్దరించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. దీంతో నిత్యం చేసే అభిషేక జలాలు, పాలు, నెయ్యి వంటి పదార్ధాలు ఆలయంలోనే ఇంకుతున్నాయి. ఇలా ఏళ్లతరబడి జరగడంతో శివలింగం ఉన్న ప్రాంతం కుంగిపోవడం మొదలైంది. నిత్యం ద్రవపదార్ధాలు ఇంకడం వల్ల ఇసుక కుంగి దానితో పాటు శివలింగం కూడా ఒకవైపుకు ఒరుగుతోంది. ఆలయం కూడా వర్షం వస్తే కారుతోంది. టెంపుల్ మొత్తం జలమయమవుతోంది. దీనికి తోడు చీమలు, ఎలుకలు నిత్యం ఆలయం కింది భాగంలోని ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో ఆలయం కూడా ఒక వైపుకు ఒరుగుతోంది. ఈ పరిణామంపై భక్తులు బాధపడుతున్నారు. ఆలయ నిర్వాహణ కూడా చేతగాకపోతే ఎలా అని మండిపడుతున్నారు. వెంటనే సోమసూత్రాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అన్ని విధాలుగా మరమ్మతులు చేసి ఆలయాన్ని కాపాడాలని కోరుతున్నారు.

First Published:  2 Dec 2015 1:05 AM GMT
Next Story