Telugu Global
Cinema & Entertainment

 దీపిక వారిద్దరి మధ్య‌ పొగ బెడుతుందా?

ప్రేమ సుధ‌లు..విర‌హా వ్య‌థ‌లు  మ‌ర‌పురాని క‌థ‌లు అంటారు పెద్ద‌లు.   అయితే  డీప్ గా ప్రేమ బంధంలో వున్న  వారు  విడిపోయినా.. ఏదో ఒక సంద‌ర్భంంలో క‌ల‌సిన‌ప్పుడు  వారి మ‌ధ్య కెమిస్ట్రి  ఎక్క‌డకి పోదు.ఇక ఫిల్మ్ స్టార్స్ విష‌యంలో అయితే చెప్ప‌న‌వ‌రం లేదు.  దీపిక ప‌దుకోణ్ లాంటి   డైన‌మిక్ లేడి గురించి అయితే  చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో  బాలీవుడ్  హాట్ బాయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో   పీకుల్లోతు ప్రేమ‌లో  కురుకు పోయింది. అయితే […]

 దీపిక వారిద్దరి మధ్య‌ పొగ బెడుతుందా?
X
ప్రేమ సుధ‌లు..విర‌హా వ్య‌థ‌లు మ‌ర‌పురాని క‌థ‌లు అంటారు పెద్ద‌లు. అయితే డీప్ గా ప్రేమ బంధంలో వున్న వారు విడిపోయినా.. ఏదో ఒక సంద‌ర్భంంలో క‌ల‌సిన‌ప్పుడు వారి మ‌ధ్య కెమిస్ట్రి ఎక్క‌డకి పోదు.ఇక ఫిల్మ్ స్టార్స్ విష‌యంలో అయితే చెప్ప‌న‌వ‌రం లేదు. దీపిక ప‌దుకోణ్ లాంటి డైన‌మిక్ లేడి గురించి అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ హాట్ బాయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో పీకుల్లోతు ప్రేమ‌లో కురుకు పోయింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఎక్కడో చెడింది.. అటు ర‌ణ‌బీర్ క‌పూర్.. క‌త్రీనా క‌ఫ్ కు ద‌గ్గ‌ర‌వ్వ‌గా.. ఇటు దీపిక ప‌దుకోణ్ ర‌ణ్వీర్ సింగ్ కు ద‌గ్గ‌ర‌య్యింది. అయితే ర‌ణ‌బీర్, దీపిక బ్రేకప్ అయిన త‌రువాత కూడా కలిసి చిత్రాలు చేస్తూ బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు శ్రీ‌కారం చుట్టారు.
అయితే ఇంత కాలం క‌త్రీనా , ర‌ణ‌బీర్ ల మ‌ధ్య ప్రేమ బంధం ఫెవిక‌ల్ మాదిరి గ‌ట్టి ప‌డింది. అయితే ఈ మ‌ద్య విడుద‌లైన త‌మ‌షా చిత్రం లో దీపిక , ర‌ణ‌బీర్ క‌ల‌సి చేశారు. పాత ప్రేమికులు కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య స్క్రీన్ కెమిస్ట్రి బాగానే పండింద‌ట‌. ఇదిలా వుంటే.. ఈ చిత్రం స‌క్స‌స్ మీట్ ను బి టౌన్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ అండ్ త‌మ‌షా టీమ్ జ‌ర‌పుకున్నారు. ఈ పార్టీకి ర‌ణ‌బీర్ స్వీట్ హార్ట్ క‌త్రీనా మాత్రం రాలేద‌ట‌. త‌న‌కు ఆహ్వానం పంపినప్ప‌టికి రాక పోవ‌డంతో బి టౌన్ లో అనేక రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ మ‌ధ్య ఒక ప్రెస్ మీట్ లో దీపిక ర‌ణ‌బీర్ ను ఉద్దేశించి.. అనేక ర‌కాల కామెంట్స్ చేసి క‌త్రీనా కైఫ్ ను మ‌రింత డిఫెన్స్ లోప‌డేసింది. దీపిక ప‌దుకోణ్ ను నేరుగా చూడ‌టం ఇష్టం లేక‌నే ర‌ణ‌బీర్ క‌పూర్ స్వీట్ హార్ట్ త‌మషా ఫంక్ష‌న్ కు రాలేదు అనేది స‌న్నిహితులు స‌మాచారం. మ‌రి ఇదంతా దీపిక కావాల‌నే వీరిద్ద‌రి మ‌ధ్య పొగ బెడుతుందా..? లేక స‌ర‌ద‌గా ఆట ప‌ట్టిస్తుందా..? క‌త్రీనా కైఫ్ ను టార్గెట్ చేస్తుందా..? న‌టిగా టాప్ రేంజ్ లో వున్న దీపిక అస‌లేం చేస్తుంది వీరిద్ద‌రి విష‌యంలో అనేది ఎవ‌రికి అర్దం కావ‌డం లేదు మ‌రి.
First Published:  1 Dec 2015 7:07 PM GMT
Next Story