Telugu Global
NEWS

ఆనం చెప్పిన జడపదార్ధ సిద్ధాంతం

తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్న ఆనం వివేకానందరెడ్డి పార్టీ మారడాన్ని సమర్ధించుకున్నారు. అంతేకాదు పార్టీలు మారే నేతలందరూ పనికొచ్చేలా ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. ఆనం వివేకా దృష్టిలో రాజకీయం అన్నది జడ పదార్దం కాదట. రాజకీయమంటే జడపదార్ధం కాదని ఎక్కడి వేస్తే అక్కడే ఉండే అలవాటు రాజకీయానికి ఉండదని చెప్పారు.  ఎప్పటికప్పుడు ప్రజల అవసరానికి, ప్రజా చైతన్యానికి అనుగుణంగా తన రంగు, రూపు, గమ్యం మార్చుకునేదే రాజకీయం అంటే […]

ఆనం చెప్పిన జడపదార్ధ సిద్ధాంతం
X

తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్న ఆనం వివేకానందరెడ్డి పార్టీ మారడాన్ని సమర్ధించుకున్నారు. అంతేకాదు పార్టీలు మారే నేతలందరూ పనికొచ్చేలా ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. ఆనం వివేకా దృష్టిలో రాజకీయం అన్నది జడ పదార్దం కాదట. రాజకీయమంటే జడపదార్ధం కాదని ఎక్కడి వేస్తే అక్కడే ఉండే అలవాటు రాజకీయానికి ఉండదని చెప్పారు.

ఎప్పటికప్పుడు ప్రజల అవసరానికి, ప్రజా చైతన్యానికి అనుగుణంగా తన రంగు, రూపు, గమ్యం మార్చుకునేదే రాజకీయం అంటే అని అబ్రహం లింకన్ రేంజ్‌లో చెప్పారు. వివేకా మాటలు విన్న వెంటనే కొందరు మీడియా ప్రతినిధులు మరీ వైసీపీలోకి బొత్ససత్యనారాయణ వెళ్లినప్పుడు మీరేందుకు తిట్టారని ప్రశ్నించారు. వెంటనే తేరుకున్న ఆనం… వైసీపీలోకి వెళ్లేవారిని తిడితే తప్పులేదన్నారు. టీడీపీ లాంటి పార్టీకే తన మాటలు వర్తిస్తాయని చెప్పారు. 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని మోకాళ్లు కూడా ఒంగడం లేదని ఈ టైమ్‌లో పదవుల కోసం ఎందుకు పాకులాడుతామని ఆనం వివేకానందరెడ్డి ప్రశ్నించారు.

First Published:  2 Dec 2015 5:29 AM GMT
Next Story