Telugu Global
Cinema & Entertainment

సుకుమారితో సుకుమార్‌ మ‌రోసారి

కుమారి 21 ఎఫ్‌తో కుర్రాళ్ల గుండెల్లో టెంట్ వేసుకుని కూర్చుంది హెబా ప‌టేల్‌! అంత‌లా కుర్రాళ్ల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టిన ఈ ముద్దుగుమ్మ‌తో త్వ‌ర‌లోనే సుకుమార్ మ‌రో సినియా చేయ‌బోతున‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల విడుద‌లైన కుమారి 21 ఎఫ్ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు సుకుమార్‌. చిన్న సినిమాగా వ‌చ్చినా.. బంప‌ర్ హిట్ సాధించ‌డంతో హెబా ప‌టేల్ కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ముద్దుగుమ్మ వెరైటీ చిత్రాల కోసం కుర్ర‌కారు గూగుల్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఒక్క‌సారిగా హెబాకు […]

సుకుమారితో సుకుమార్‌ మ‌రోసారి
X
కుమారి 21 ఎఫ్‌తో కుర్రాళ్ల గుండెల్లో టెంట్ వేసుకుని కూర్చుంది హెబా ప‌టేల్‌! అంత‌లా కుర్రాళ్ల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టిన ఈ ముద్దుగుమ్మ‌తో త్వ‌ర‌లోనే సుకుమార్ మ‌రో సినియా చేయ‌బోతున‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల విడుద‌లైన కుమారి 21 ఎఫ్ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు సుకుమార్‌. చిన్న సినిమాగా వ‌చ్చినా.. బంప‌ర్ హిట్ సాధించ‌డంతో హెబా ప‌టేల్ కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ముద్దుగుమ్మ వెరైటీ చిత్రాల కోసం కుర్ర‌కారు గూగుల్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఒక్క‌సారిగా హెబాకు వ‌చ్చిన ఈ స్టార్‌డమ్ ని మ‌రింతగా పెంచే ప‌నిలో ప‌డ్డాడు సుకుమార్‌!
అల్లుడి తెరంగ్రేట్రం
సుకుమార్‌కి ఓ మేన‌ల్లుడు ఉన్నాడు. అత‌ని పేరు అశోక్‌! త్వ‌ర‌లోనే ఈ కుర్రాడిని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే త‌న మేన‌ల్లుడి కోసం ఓ క‌థ‌ని సిద్ధం చేశాడ‌ట‌. స్క్రీన్ ప్లే సుకుమారే అందిస్తాడ‌ని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా హెబాను క‌న‌ఫ‌ర్మ్ చేశాడు సుకుమార్‌. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా షూటింగ్ పూర్త‌య్యాక ఈ చిత్రం మొద‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఈ చిత్రానికి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సుకుమారే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడా? లేకుంటే త‌న శిష్యుల్లో ఇంకెవ‌రికికైనా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పుతాడా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.
First Published:  29 Nov 2015 7:03 PM GMT
Next Story