Telugu Global
Cinema & Entertainment

రాజ‌మౌళికి ఇంట్రెస్ట్ లేద‌ట‌

అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, అవార్డుల మీద మాత్రం అనాసక్తి  చూపిస్తున్నారు. రాజమౌళి స్నేహితుడు, ఆర్థోపెడీషీయన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి కుమార్తె వివాహం కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. తెలుగు సినిమా నామినేషన్లలో బాహుబలి 14 విభాగాల్లో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ(ఐఫా)’కి నామినేట్ అయిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ..అవార్డుల మీద తనకు అంతగా ఆసక్తి లేదన్నారు. వాటికి అంతగా ప్రాధాన్యం ఉంటుందని భావించడం […]

రాజ‌మౌళికి ఇంట్రెస్ట్ లేద‌ట‌
X

అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, అవార్డుల మీద మాత్రం అనాసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి స్నేహితుడు, ఆర్థోపెడీషీయన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి కుమార్తె వివాహం కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. తెలుగు సినిమా నామినేషన్లలో బాహుబలి 14 విభాగాల్లో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ(ఐఫా)’కి నామినేట్ అయిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ..అవార్డుల మీద తనకు అంతగా ఆసక్తి లేదన్నారు. వాటికి అంతగా ప్రాధాన్యం ఉంటుందని భావించడం లేదన్నారు.

తాను ఎలాంటి అవార్డు ఫంక్షన్ ల కి హాజరు కావడంలేదని రాజమౌళి తెలిపారు. ఒక వేళ బాహుబలి చిత్రానికి పని చేసిన ఎవరికైనా ఈ అవార్డు వస్తే చాలా సంతోషం అన్నారు. వాళ్లకు ఈ అవార్డు ప్రోత్సహంకంగా ఉంటుందని చెప్పారు. తెలుగు సినిమా నామినేషన్లలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఉత్తమ నటుడు, నటి, సంగీత దర్శకుడు, పాటలతో సహా 14 విభాగాల్లో ‘బాహుబలి’ నామినేట్ అయిన విషయం తెలిసిందే. బాహుబలి చిత్రం నుంచి ఉత్తమ గాయని విభాగానికి ముగ్గురూ, ఉత్తమ గాయకుడి విభాగానికి ఇద్దరు నామినేట్ అవడం విశేషం. రానున్న డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ ‘ఐఫా – ఉత్సవమ్’ లో విజేతల ప్రకటన, అవార్డు ప్రదానం జరుగుతుంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీలకు సంబంధించి ఓటు వేస్తారు. ఆ ఓట్లన్నిటినీ లెక్కించి, శాస్త్రీయ పద్ధతిలో విజేతలను నిర్ణయిస్తారు.

First Published:  28 Nov 2015 7:02 PM GMT
Next Story