Telugu Global
Cinema & Entertainment

దేవీకి ప‌వ‌ర్ స్టార్ చాలెంజ్‌

ప‌వ‌న్ అభిమానుల‌కు శుభ‌వార్త‌! ప‌వ‌ర్‌స్టార్ అప్‌క‌మింగ్ మూవీలో ప‌వ‌న్ అదిరిపోయే స్టెప్పులు వేయ‌నున్నాడంట‌. చిరంజీవి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలంద‌రూ మంచి డాన్స‌ర్లుగా పేరు తెచ్చుకున్నారు. ప‌వ‌న్ కూడా చ‌క్క‌టి డాన్స‌ర్‌. ప‌వ‌న్ డాన్సుల్లో మైకెల్ జాక్స‌న్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంద‌న్న‌ది తెలిసిందే! సినిమా కెరీర్‌లో బాగానే డాన్సులు చేసిన ప‌వ‌న్ క‌ల్యాన్ త‌రువాత కాలంలో స్ట‌యిలిష్ స్టెప్పుల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు. 2012లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయింది. చాలాకాలం త‌రువాత […]

దేవీకి ప‌వ‌ర్ స్టార్ చాలెంజ్‌
X
ప‌వ‌న్ అభిమానుల‌కు శుభ‌వార్త‌! ప‌వ‌ర్‌స్టార్ అప్‌క‌మింగ్ మూవీలో ప‌వ‌న్ అదిరిపోయే స్టెప్పులు వేయ‌నున్నాడంట‌. చిరంజీవి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలంద‌రూ మంచి డాన్స‌ర్లుగా పేరు తెచ్చుకున్నారు. ప‌వ‌న్ కూడా చ‌క్క‌టి డాన్స‌ర్‌. ప‌వ‌న్ డాన్సుల్లో మైకెల్ జాక్స‌న్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంద‌న్న‌ది తెలిసిందే! సినిమా కెరీర్‌లో బాగానే డాన్సులు చేసిన ప‌వ‌న్ క‌ల్యాన్ త‌రువాత కాలంలో స్ట‌యిలిష్ స్టెప్పుల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు. 2012లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయింది. చాలాకాలం త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి స్టెప్పులున్న డాన్సులు చేయ‌డం కూడా గ‌బ్బ‌ర్‌సింగ్‌ విజ‌యానికి కార‌ణ‌మ‌ని సినీ విశ్లేష‌కులు చెబుతారు. రాబోయే సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌లోనూ ప‌వ‌న్ మ‌ళ్లీ ఒంటికి ప‌నిచెప్ప‌నున్నాడ‌ని స‌మాచారం.
ఎందుకంటే?
సినిమా కోసం సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ అదిరిపోయే ట్యూన్ల‌ను ఇచ్చాడంట‌. ఇవి విన్న ప‌వ‌న్ స్వ‌యంగా క‌లిసి మ‌రీ దేవిని అభినందించాడ‌ట‌. ఇంత మంచి ట్యూన్లు ఇచ్చినందుకు అదిరిపోయే డాన్సులు చేసి మ‌రీ చూపిస్తానంటూ చాలెంజ్ చేశాడంట‌. అంతేకాదు, ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గొంతు కూడా స‌వ‌రించుకోనున్నాడ‌ట‌. అదేనండీ..! సినిమాలో ఓ పాట కూడా పాడ‌బోతున్నాడ‌ట‌. పవ‌న్ పాట పాడిన అత్తారింటికి దారేది? ఖుషీ..! సినిమాల్లాగానే ఈ సినిమా కూడా భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. దేవి సంగీతానికి ప‌వ‌న్ వేసిన‌ స్టెప్పులు ఏ మేర‌కు మెప్పిస్తాయో.. తెలియాలంటే మార్చి ఆఖ‌రునాటికి ఆగాల్సిందే!
First Published:  27 Nov 2015 7:03 PM GMT
Next Story