Telugu Global
Others

ఎంపీగారి మామిడితోటలో....

కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.  పరిశ్రమ పేరుతో తీసుకున్న భూమిలో మామిడితోటలు సాగుచేస్తున్నారన్న ఆరోపణలు ఎంపీపై వస్తున్నాయి. ఆక్సికో కంపెనీ ఏర్పాటు చేసి స్థానికులు ఉపాధి కల్పిస్తామంటూ మూడు దశాబ్దాల క్రితం రేణుకాచౌదరి ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో 43 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారు. కానీ మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టలేదు. మునుముందు కూడా ఆ అవకాశాలు కనిపించడం లేదు. ఎంపీగారు పరిశ్రమల […]

ఎంపీగారి మామిడితోటలో....
X

కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పరిశ్రమ పేరుతో తీసుకున్న భూమిలో మామిడితోటలు సాగుచేస్తున్నారన్న ఆరోపణలు ఎంపీపై వస్తున్నాయి. ఆక్సికో కంపెనీ ఏర్పాటు చేసి స్థానికులు ఉపాధి కల్పిస్తామంటూ మూడు దశాబ్దాల క్రితం రేణుకాచౌదరి ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో 43 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారు. కానీ మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టలేదు. మునుముందు కూడా ఆ అవకాశాలు కనిపించడం లేదు. ఎంపీగారు పరిశ్రమల పేరుతో తీసుకున్న భూమిలో ఏకంగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు.

Click to Read: అరుదైన సన్నివేశం… సీఎంకు ఆట నేర్పిన సానియా(video)

రేణుకా చౌదరి ఇలా చేయడం ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేయడమే అంటూ సీపీఎం నాయకులు …. ఆ భూమిలో ఎర్రజెండాలు కూడా పాతారు. భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుని పేదలకు పంచిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంపీ భూముల్లో సీపీఎం శ్రేణులు ఎంటరవడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా భూములు సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

Click to Read: Bala Krishna gives warning to his colleague?

First Published:  28 Nov 2015 5:02 AM GMT
Next Story