Telugu Global
Cinema & Entertainment

బ్రూస్‌లీపై కోన వెంకట్ హాట్ కామెంట్స్

దర్శకుడు శ్రీనువైట్లపై మరోసారి రచయిత కోన వెంకట్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమా తన పరువు తీసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. బ్రూస్‌వీ వల్లే తన ఇమేజ్ దెబ్బతిందని చెప్పారు. సినిమా కోసం తానురాసిన సన్నివేశాలను కరెక్ట్‌గా వాడుకుని ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పి పరోక్షంగా శ్రీనువైట్లను తప్పుపట్టారు. సినిమా కోసం 72సన్నివేశాలు రాశానని అయితే వాటిని ఎలా వాడుకోవాలన్నది డైరెక్టర్‌ నిర్ణయమేనని అన్నారు. డిసెంబర్ 4న విడుదల […]

బ్రూస్‌లీపై కోన వెంకట్ హాట్ కామెంట్స్
X

దర్శకుడు శ్రీనువైట్లపై మరోసారి రచయిత కోన వెంకట్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమా తన పరువు తీసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. బ్రూస్‌వీ వల్లే తన ఇమేజ్ దెబ్బతిందని చెప్పారు. సినిమా కోసం తానురాసిన సన్నివేశాలను కరెక్ట్‌గా వాడుకుని ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పి పరోక్షంగా శ్రీనువైట్లను తప్పుపట్టారు. సినిమా కోసం 72సన్నివేశాలు రాశానని అయితే వాటిని ఎలా వాడుకోవాలన్నది డైరెక్టర్‌ నిర్ణయమేనని అన్నారు. డిసెంబర్ 4న విడుదల కాబోతున్న శంకరాభరణం మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో కోన ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీనువైట్ల తీరు నచ్చకే కోన వెంకట్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. వీరి మధ్య గతంలోనే ఓ సారి గ్యాప్ వచ్చింది. అందుకే బాద్షా సినిమా తర్వాత విబేధాల కారణంగా ఆగడు సినిమాకు వీరుకలిసి పనిచేయలేదు. కానీ రామ్‌చరణ్‌ వీరిద్దరి మధ్య రాజీ చేసి బ్రూస్‌లీ కోసం పనిచేసేలా చూశాడు. కానీ ఆ చిత్రం ఘోరంగా దెబ్బతింది. అప్పటి నుంచి శ్రీనువైట్ల, కోన వెంకట్‌ మధ్య మళ్లీ గ్యాప్ వచ్చింది. బ్రూస్‌లీ ఫెయిల్ అవడానికి కారణం తనే అంటూ జరుగుతున్న ప్రచారంపై అప్పట్లోనే కోన వెంకట్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఓ దశలో దర్శకుడిపై పరువు నష్టం దావవేస్తారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను అప్పట్లో ఖండించిన కోన… ఇప్పుడు మనసులో మాట బయటపెట్టారు.

First Published:  28 Nov 2015 10:10 AM GMT
Next Story