Telugu Global
Cinema & Entertainment

కుమారి 21 ఎఫ్ కాపీనా?  సుకుమార్ జీవితం కాదా?

కుమారి 21 ఎఫ్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌పుడు ఇది ఫీల్‌గుడ్ సినిమా అని, ఏదో ఇంగ్లిష్ సినిమా నుంచి ఎత్తి తెచ్చారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దీనిపై ద‌ర్శ‌కుడు  సూర్య‌ప్ర‌తాప్ స్పందించాడు. కుమారి సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ కాద‌ని, ఇది సుకుమార్ జీవితంలో జరిగిన స‌న్నివేశాల ఆధారంగా రాసుకున్న క‌థ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు వ‌స్తోన్న‌ వార్త‌లు సుకుమార్‌కి కూడా కాపీ మ‌ర‌క అంటిస్తున్నాయి. కుమారి సినిమా కాపీ అని నిరూపించే […]

కుమారి 21 ఎఫ్ కాపీనా?  సుకుమార్ జీవితం కాదా?
X
కుమారి 21 ఎఫ్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌పుడు ఇది ఫీల్‌గుడ్ సినిమా అని, ఏదో ఇంగ్లిష్ సినిమా నుంచి ఎత్తి తెచ్చారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దీనిపై ద‌ర్శ‌కుడు సూర్య‌ప్ర‌తాప్ స్పందించాడు. కుమారి సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ కాద‌ని, ఇది సుకుమార్ జీవితంలో జరిగిన స‌న్నివేశాల ఆధారంగా రాసుకున్న క‌థ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు వ‌స్తోన్న‌ వార్త‌లు సుకుమార్‌కి కూడా కాపీ మ‌ర‌క అంటిస్తున్నాయి. కుమారి సినిమా కాపీ అని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
బాహుబ‌లి బాట‌లోనే..!
తెలుగు సినిమాలో కొంత‌కాలంగా ఏ సినిమా విడుద‌లైనా ఏ విదేశీ సినిమాల నుంచో కాపీ కొట్టారన్న‌విష‌యం ఫ‌స్ట్‌లుక్‌లోనే తెలిసిపోతుంది. దీన్ని ప్రేక్ష‌కులు కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. సినిమాను మ‌న ద‌ర్శ‌కులు ఎంత ఆస‌క్తిక‌రంగా తీశార‌న్న విష‌యంపైనే ప్రేక్ష‌కులు దృష్టి సారిస్తున్నారు. బాహుబ‌లి సినిమా కూడా ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా హిట్ కొట్ట‌డంతో చిత్ర విజ‌యం ముందు ఆ విమ‌ర్శ‌లు నిల‌వ‌లేక‌పోయాయి. ఇప్పుడు కుమారి 21 ఎఫ్ సినిమా మాతృక ఏంటో తెలిసిపోయింది. ‘గ‌ర్ల్ నెక్ట్స్ డోర్’ అనే ఇంగ్లిష్ సినిమా నుంచి సుకుమార్ బేస్ లైన్ ఎత్తేశాడ‌ని టాక్ బ‌య‌ల్దేరింది. సినిమా క్లైమాక్స్ స‌న్నివేశాల‌న్నీ అర్జెంటినా మూవీ ‘సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’ నుంచి ఎత్తుకొచ్చార‌ని, ‘లీలాడ‌క్కా’ అనే ఫ్రెంచి సినిమా నుంచి సుకుమార్ కొన్ని సీన్ల‌ను తీసుకున్నాడ‌ని ఇప్పుడు సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్ల‌లో వార్త‌లు షికారు చేస్తున్నాయి. మొత్తానికి విదేశీ వంట‌దినుసులు తెచ్చి ఇక్క‌డ కిచిడి వండేశాడ‌న్న మాట‌! ఏదైతేనేం మొత్తానికి ఈ కిచిడీ క‌థ‌తో హిట్‌కొట్టాడు సుకుమార్‌.
First Published:  27 Nov 2015 7:02 PM GMT
Next Story