Telugu Global
Others

దారుణ మోసాలకు పాల్పడుతున్న శ్రీచైతన్య, నారాయణ

తెలుగురాష్ట్రాల్లో పాతుకుపోయిన శ్రీచైతన్య, నారాయణ కాలేజీల వ్యవహారాన్ని విజిలెన్స్ నివేదిక బట్టబయలు చేసింది. అందులో షాకింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఈ రెండు కాలేజీలు విద్యావ్యవస్థకు చేస్తున్న నష్టాన్ని ఉన్నత విద్యా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తన విచారణలో బయటపెట్టింది.  కాలేజ్‌ల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేసింది.  ఈ రెండు విద్యా సంస్థలు విద్యాసేవ పేరుతో సొసైటీలు పెట్టి దారుణంగా వ్యాపారం చేశాయని విజిలెన్స్ తేల్చింది. పేద విద్యార్థుల కోటా నిబంధనకు తూట్లు పొడిచి వందల కోట్లు […]

దారుణ మోసాలకు పాల్పడుతున్న శ్రీచైతన్య, నారాయణ
X

తెలుగురాష్ట్రాల్లో పాతుకుపోయిన శ్రీచైతన్య, నారాయణ కాలేజీల వ్యవహారాన్ని విజిలెన్స్ నివేదిక బట్టబయలు చేసింది. అందులో షాకింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఈ రెండు కాలేజీలు విద్యావ్యవస్థకు చేస్తున్న నష్టాన్ని ఉన్నత విద్యా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తన విచారణలో బయటపెట్టింది. కాలేజ్‌ల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేసింది.

ఈ రెండు విద్యా సంస్థలు విద్యాసేవ పేరుతో సొసైటీలు పెట్టి దారుణంగా వ్యాపారం చేశాయని విజిలెన్స్ తేల్చింది. పేద విద్యార్థుల కోటా నిబంధనకు తూట్లు పొడిచి వందల కోట్లు వెనుకేసుకున్నారని బయటపెట్టింది. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ కమిటీ 2010-2011, 2011-2012లలో రూ.200 కోట్ల వ్యాపారం చేసింది. కానీ ఇన్‌కమ్ టాక్స్ మాత్రం జీరోగా చూపింది. విజిలెన్స్ నివేదికలోని అంశాలు, సిఫార్సులు…

ల్యాబ్‌లు లేని ఘనమైన కాలేజ్‌లు
ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ఆర్ట్స్ గ్రూపులను అసలే నడపటం లేదు. సైన్స్ కోర్సులు మాత్రమే నడుస్తున్నాయి. కానీ సరైన సైన్స్ ల్యాబులు లేవు.

ఫీజులు ఎంతన్నది ప్రచారం చేయాలి
క్వాలిఫైడ్ టీచర్‌ను ఎంపిక చేసే క్రమంలో ప్రభుత్వ నిబంధనలను ఈ రెండు కాలేజీలు పాటించడం లేదు. దీనిపైనా చర్యలు తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలి. ఏయే కాలేజీలలో ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారనే అంశంపై ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలి. అందుకోసం మార్గదర్శకాలు రూపొందించాలి. జీతాలు, ఆదాయం, ఖర్చు, మౌలిక సదుపాయాలు ప్రాతిపదికగా ఫీజులు ఖరారు చేయాలి.

Click to Read: గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు- మహిళలపై చింతమనేని బూతులు

ఈ కాలేజీల విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీ లేదు
మున్సిపల్ శాఖ అనుమతి లేకుండానే రెసిడెన్షియల్ హాస్టళ్లు నడుపుతున్నారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలలో విద్యార్థులకు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండటం లేదని విజిలెన్స్ తేల్చింది. జూనియర్ కాలేజీలలో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లు, షార్ట్‌టర్మ్ కోచింగ్‌లకు అవకాశం ఇవ్వవద్దని ప్రభుత్వానికి సూచించింది.

రిజర్వేషన్లకు తూట్లు…
రిజర్వేషన్ల విధానాన్ని అసలే పాటించడం లేదు. అడ్మిషన్‌లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సి ఉన్నా.. వాటిని మాయం చేశారు. విద్యా వ్యవస్థను శాసిస్తున్న ఈ రెండు కాలేజ్‌ల గుర్తుంపులు రద్దు చేయాలంటూ ఒక తీవ్రమైన సిఫార్సును కూడా ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్‌ సిఫార్సుచేసింది. ఇలా ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ శ్రీచైతన్య, నారాయణ వల్ల విద్యావ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని వివరించింది. విజిలెన్స్ నివేదికలోకి అంశాలను తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది.

Click to Read: Intolerance statements boomerang on Shahrukh, Aamir

First Published:  28 Nov 2015 12:02 AM GMT
Next Story