Telugu Global
Others

నా భర్తను చంపేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన గంగిరెడ్డి భార్య మాళవిక హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త గంగిరెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ పిటిషన్ వేశారు. రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో తన భర్తను మట్టుబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారామె. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎన్‌కౌంటర్‌ చేసే అవకాశం ఉందని  అనుమానం వ్యక్తం చేశారు. కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏదైనా జైలుకు తన భర్తను తరలించేలా […]

నా భర్తను చంపేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు
X

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన గంగిరెడ్డి భార్య మాళవిక హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త గంగిరెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ పిటిషన్ వేశారు. రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో తన భర్తను మట్టుబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారామె. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎన్‌కౌంటర్‌ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏదైనా జైలుకు తన భర్తను తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

అలిపిరి కేసులో తన భర్తను నిర్దోషిగా కోర్టు ప్రకటించినప్పటికీ చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కక్ష సాధింపుకు దిగారని పిటిషన్‌లో ఆమె చెప్పారు. తమ కుటుంబసభ్యులను కూడా పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మాళవిక ఆరోపించారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు ఎలా చెబితే అలా చేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో తన భర్త ప్రాణాలకు రక్షణ కల్పించాలని హైకోర్టును మాళవిక కోరారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా ఏపీ సీఎస్, డీజీపీ, కడప, కర్నూలు, చిత్తూరు ఎస్పీలను చేర్చారు. చంద్రబాబు, సీఐడీ అదనపు డీజీ తిరుమలరావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పిటిషన్‌లో పొందుపరిచారామె.

First Published:  28 Nov 2015 9:07 AM GMT
Next Story