Telugu Global
Others

ఇదీ ఆయుత మహా చండీయాగం

తెలంగాణతోపాటు యావత్ దేశమంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత మహా చండీయాగంపై దృష్టిపెట్టారు. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ప్రధాని నరేంద్రమోడీ, పలురాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను కేసీఆర్ ఆహ్వానించారు. అసలు ఇంతకీ ఆయుత మహా చండీయాగానికి అంత ప్రాధాన్యత ఎందుకు? ఈ యాగం ఫలం ఏంటన్నది తెలుసుకుందాం.  లక్ష కోట్ల యజ్ఞాల ఫలం: ఆయుత చండీయాగాన్నే శత సహస్ర చండీయాగంగా పిలుస్తారు. ఆయుత చండీయాగం లక్ష చండీయాగాలతో సమానం అంటారు పండితులు. ఒక […]

ఇదీ ఆయుత మహా చండీయాగం
X
తెలంగాణతోపాటు యావత్ దేశమంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత మహా చండీయాగంపై దృష్టిపెట్టారు. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ప్రధాని నరేంద్రమోడీ, పలురాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను కేసీఆర్ ఆహ్వానించారు. అసలు ఇంతకీ ఆయుత మహా చండీయాగానికి అంత ప్రాధాన్యత ఎందుకు? ఈ యాగం ఫలం ఏంటన్నది తెలుసుకుందాం.
లక్ష కోట్ల యజ్ఞాల ఫలం:
ఆయుత చండీయాగాన్నే శత సహస్ర చండీయాగంగా పిలుస్తారు. ఆయుత చండీయాగం లక్ష చండీయాగాలతో సమానం అంటారు పండితులు. ఒక చండీయాగం కోటి యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది. అలాంటిది ఆయుత చండీయాగం అంటే లక్ష కోట్ల యజ్ఞాల ఫలం అని వేద పండితులు చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల కిందట శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఆయుత చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాగం చేయడంవల్ల వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉంటారని, ప్రకృతి వైపరీత్యాలు దరిచేరవని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో పండితులు చెబుతున్నారు.
యాగం ఇలా:
ఆయుత మహా చండీయాగంలో మహా రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్ర హోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరుగనున్నాయి. 100 హోమగుండాలతో 1500మంది రుత్విక్కులు 5 రోజుల పాటు 10వేల సప్త శతి పారాయణాలు చేస్తారు. చండీ నవాక్షరీ జపాలతో రుత్విక్కులు ఒక్కొక్కరు తొలిరోజు ఒక సప్తశతి పారాయణం, 4వేల చండీ నవాక్షరీ జపం చేస్తారు. రెండో రోజు రెండు పారాయణాలు, 3వేల నవాక్షరీ జపం. 3వరోజూ 3 పారాయణాలు, 2వేల నవాక్షరీ జపం. 4వరోజు నాలుగు సప్తశతి పారాయణాలు వేయి చండీ నవాక్షరీ జపం చేస్తారు.
చివరి రోజు ఒక్కో హోమగుండం వద్ద 11మంది రుత్విక్కులు పాయసంతో హోమం చేస్తారు. 100మంది బ్రాహ్మణులు పాలతో 10వేల పారాయణాలకు దశాంశం వేయిసార్లు తర్పణాలిస్తారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇక ప్రతిరోజూ నవదుర్గలకు నవావరణ పూజ, బలి ప్రదానం, సువాసిని, కన్యకా పూజలు నిర్వహిస్తారు. శ్రీ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీ తీర్ధ మహాస్వామివారి ఆశీస్సులతో అయుత చండీయాగం జరగనుంది. ఈ యాగానికి ఆచార్య, బ్రహ్మలుగా శృంగేరీ శారదా పీఠం శిష్యులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, బ్రహ్మశ్రీ ఫణిశశాంక శర్మలు వ్యవహరిస్తారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో యాగం నిర్వహించనున్నారు.
భారీగా ఏర్పాట్లు:
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గర్లోని 22 ఎకరాల్లో చండీయయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5రోజుల పాటు జరిగే ఆయుత చండీయాగం కోసం 10 టన్నుల మోదుగు కర్రలను సేకరిస్తున్నారు. రోజు దాదాపు 10 క్వింటాళ్ల నెయ్యి అవసరం ఉంటుందని అంచనా. నిత్యం సుమారు 30 వేల మంది భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భూమి చదునుచేసే కార్యక్రమం మొదలైది. ఇక్కడే వేద పండితులు, పీఠాధిపతుల కోసం తాత్కాలిక బసకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మలమైన భక్తితో చేసే యాగానికి దేవతానుగ్రహం విశేషంగా ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు. లోక కల్యాణమే లక్ష్యంగా కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన అయుత చండీయాగాన్ని అద్వితీయంగా సాగానాలని పండితులు కోరుకుంటున్నారు.
First Published:  28 Nov 2015 6:23 AM GMT
Next Story