Telugu Global
CRIME

లాడ్జ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కీచక టీచర్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు కీచకులుగా మారుతున్నారు . తాజాగా నల్లగొండ జిల్లాలో వక్రబుద్ధి టీచర్‌ ఉదంతం బయటపడింది. ఏకంగా పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జ్‌కు తీసుకెళ్లాడు.  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల జడ్పీహెచ్‌ స్కూల్లో పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు గురువారం అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మాయమాటలు చెప్పి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా సూర్యాపేటకు తీసుకొచ్చాడు. పట్టణంలోని ఓ లాడ్జ్‌లో దిగారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి […]

లాడ్జ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కీచక టీచర్
X

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు కీచకులుగా మారుతున్నారు . తాజాగా నల్లగొండ జిల్లాలో వక్రబుద్ధి టీచర్‌ ఉదంతం బయటపడింది. ఏకంగా పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల జడ్పీహెచ్‌ స్కూల్లో పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు గురువారం అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మాయమాటలు చెప్పి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా సూర్యాపేటకు తీసుకొచ్చాడు. పట్టణంలోని ఓ లాడ్జ్‌లో దిగారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కీచక నాగేశ్వరరావును లాడ్జ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. టీచర్‌ను అరెస్ట్‌ చేశారు. మైనర్ బాలికను మాయమాటలతో మభ్యపెట్టిన నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

First Published:  25 Nov 2015 1:01 PM GMT
Next Story