Telugu Global
Cinema & Entertainment

మిర‌ప‌కాయ్ టీంతో దిల్ రాజ్

షాక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో షాక్ తిన్న ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌! త‌రువాత అదే హీరో ర‌వితేజతో మిర‌ప‌కాయ్ సినిమా తీసి హిట్ కొట్టాడు. త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా బంప‌ర్ హిట్ట‌యింది. దీంతో రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హ‌రీశ్‌. కానీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేసిన రామ‌య్య వ‌స్తావ‌య్య ప్లాప్ అవ‌డంతో చిన్న హీరో సాయిధ‌ర‌మ్‌తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్  సినిమా చేసి ఫ‌ర‌వాలేద‌నిపించాడు. సుబ్ర‌హ‌ణ్యం […]

మిర‌ప‌కాయ్ టీంతో దిల్ రాజ్
X
షాక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో షాక్ తిన్న ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌! త‌రువాత అదే హీరో ర‌వితేజతో మిర‌ప‌కాయ్ సినిమా తీసి హిట్ కొట్టాడు. త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా బంప‌ర్ హిట్ట‌యింది. దీంతో రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హ‌రీశ్‌. కానీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేసిన రామ‌య్య వ‌స్తావ‌య్య ప్లాప్ అవ‌డంతో చిన్న హీరో సాయిధ‌ర‌మ్‌తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా చేసి ఫ‌ర‌వాలేద‌నిపించాడు. సుబ్ర‌హ‌ణ్యం అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో పెద్ద‌హీరోలెవ‌రూ హ‌రీశ్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదంట‌. అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ త‌న త‌రువాత ప్రాజెక్టును ఇంత‌వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు.
మ‌రోసారి మాస్ మ‌హారాజాతోనే..!
హ‌రీశ్‌కు ఇండ‌స్ట్రీలో లైఫ్ ఇచ్చిన హీరో ర‌వితేజ‌! ఒక్క‌సారి కాదు ఏకంగా రెండుసార్లు! ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబినేష‌న్‌లో ఒక సినిమా రూపొంద‌బోతోంది. పెద్ద‌హీరోలెవ‌రూ చేసేందుకు ముందుకు రాని ప‌రిస్థితుల్లో మాస్ మ‌హారాజాకు హ‌రీశ్ ఓ క‌థ వినిపించాడు. దానికి ర‌వితేజ ప‌చ్చ‌జెండా ఊపేశాడు. దీంతో ఎగిరి గంతేశాడు హ‌రీశ్! ఇక స్ర్కిప్టు ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌య్యాడంట హ‌రీశ్. ఇంత‌కీ ఈ సినిమాకు నిర్మాత ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు దిల్ రాజే! ఆల్రెడీ ర‌వితేజ‌తో భ‌ద్ర‌, హ‌రీశ్‌తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలు చేశాడు దిల్ రాజు. అయితే, ఈ ముగ్గురి బినేష‌న‌ల్‌లో వ‌స్తున్న తొలి సినిమా మాత్రం ఇదే! స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా ఉండే దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా… పైగా ర‌వితేజ‌-హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ కావ‌డంతో మార్కెట్ వ‌ర్గాల్లో అప్పుడే ఆస‌క్తి మొద‌లైంది.
Next Story