Telugu Global
Cinema & Entertainment

భార్య ను చూపించి రికార్డు కొట్టాడు

సెలబ్రిటీలు ఏం చేసినా అభిమానులకు పండుగే.  ముఖ్యంగా  తాము  ఆరాధించే హీరో, హీరోయిన్ల  వ్యక్తిగత ముచ్చట్లు,  కులాసా కబుర్లు తెలిస్తే వారికి సందడే సందడి.  బాలీవుడ్‌ యువహీరో  షాహిద్ కపూర్  విషయంలోనూ అదే జరిగింది. షాహిద్‌ కపూర్‌ తన భార్య మీరా రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోమవారం రాత్రి తన ఫేస్‌బుక్‌ లో షేర్ చేశాడు. ఇక అంతే… క్షణాల్లో అది వైరల్ అయిపోయింది. ఎంతగా ప్రచారం అంటే.. కేవలం 24 గంటల్లోనే దాదాపు […]

భార్య ను చూపించి రికార్డు కొట్టాడు
X
సెలబ్రిటీలు ఏం చేసినా అభిమానులకు పండుగే. ముఖ్యంగా తాము ఆరాధించే హీరో, హీరోయిన్ల వ్యక్తిగత ముచ్చట్లు, కులాసా కబుర్లు తెలిస్తే వారికి సందడే సందడి. బాలీవుడ్‌ యువహీరో షాహిద్ కపూర్ విషయంలోనూ అదే జరిగింది. షాహిద్‌ కపూర్‌ తన భార్య మీరా రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోమవారం రాత్రి తన ఫేస్‌బుక్‌ లో షేర్ చేశాడు. ఇక అంతే… క్షణాల్లో అది వైరల్ అయిపోయింది. ఎంతగా ప్రచారం అంటే.. కేవలం 24 గంటల్లోనే దాదాపు 12 లక్షల పై చిలుకు లైక్స్‌ని సంపాదించింది. అభిమానులు అక్కడితో ఆగలేదు. దాదాపు 5,770 షేర్లతో రికార్డు సృష్టించారు. అంతేనా 10 వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి. తమ అభిమాన హీరో ముచ్చటైన ఫోటోను చూసి తెగ మురిసిపోతూ కామెంట్ల వర్షం కురిపించేశారు.
కాగా బాలీవుడ్ లవర్ బాయ్ గా ఇమేజ్ కొట్టేసిన షాహిద్ కపూర్ ఇటీవల ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. తనకంటే పది సంవత్సరాలు చిన్నదైన, ఈ ఢిల్లీ గాళ్‌ ను ఎక్కడికెళ్లినా… చివరకు జిమ్ కు కూడా తన వెంట తీసుకెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం అలవాటు షాహిద్ కు. అంతేకాకుండా ఆమెతో స్పెషల్ ర్యాంప్ వాక్‌ చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇదంతా స్పెషల్ అపియరెన్స్ కోసమేనని.. మీరా రాజ్‌పుత్‌ ను హీరోయిన్ చేసేందుకే షాహిద్ కపూర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని బాలీవుడ్‌ గుసగుసలాడుతోంది.
Next Story