Telugu Global
Others

మేయర్‌ హత్యకు స్కెచ్ గీసిన వ్యక్తి ఇతడే!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో మరో ఆసక్తికర నిజం వెలుగులోకి వచ్చింది. హత్యకు స్కెచ్ గీసింది ఓ కార్పొరేటర్ భర్త అని తేలింది. స్కెచ్ గీసిన మురుగ పోలీసుల ముందు లొంగిపోయాడు. చిత్తూరు 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పద్మావతి భర్త ఈ మురుగ. టీడీపీకి చెందినప్పటికీ చింటూతో చేతులు కలిపి మేయర్ దంపతులను దగ్గరనుంచి చంపించాడు. హత్యల కోసం 11 మంది గ్యాంగ్‌ను మురుగాయే సిద్దం చేశాడు. స్కెచ్‌ కూడా ఇతడిదే. హత్యలకు ముందు […]

మేయర్‌ హత్యకు స్కెచ్ గీసిన వ్యక్తి ఇతడే!
X

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో మరో ఆసక్తికర నిజం వెలుగులోకి వచ్చింది. హత్యకు స్కెచ్ గీసింది ఓ కార్పొరేటర్ భర్త అని తేలింది. స్కెచ్ గీసిన మురుగ పోలీసుల ముందు లొంగిపోయాడు. చిత్తూరు 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పద్మావతి భర్త ఈ మురుగ. టీడీపీకి చెందినప్పటికీ చింటూతో చేతులు కలిపి మేయర్ దంపతులను దగ్గరనుంచి చంపించాడు.

హత్యల కోసం 11 మంది గ్యాంగ్‌ను మురుగాయే సిద్దం చేశాడు. స్కెచ్‌ కూడా ఇతడిదే. హత్యలకు ముందు రోజు చింటూ కార్యాలయంలో ముఠాను సమావేశపర్చి అటాక్ ఎలా చేయాలన్న ప్లాన్‌ను మురుగు వివరించారు. అటాక్ చేసిన రోజు స్విప్ట్ కారులో ఐదుగురు హంతకులను కార్పొరేషన్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చాడు. మురుగ మాత్రం కారులోనే ఉండి ఐదుగురుని లోపలికి పంపించారు. కార్యాలయంలోని ఓ బాయ్‌కి ఫోన్‌ చేసి లోపలి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు.

దాడి పూర్తి అయిన తర్వాత కూడా చాలా సేపు మురుగ కార్యాలయం బయటే ఉన్నారు. అనురాధ చనిపోయిన విషయాన్ని నిర్ధారించుకుని అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. అయితే లొంగిపోయిన మిగిలిన నిందితులు తన పేరు కూడా బయట పెట్టడడంతో మురుగ కూడా పోలీసులకు లొంగిపోయాడు. హంతకుడు మురుగ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటపడ్డాయి.

Click to Read: Will these directors bounce back?

First Published:  25 Nov 2015 12:05 AM GMT
Next Story