Telugu Global
Cinema & Entertainment

పాతిక‌శాతం లివ‌ర్‌తోనే బ‌తుకుతున్నా..!

అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ఆరోగ్యం గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాలు వెల్ల‌డించారు. తాను కేవ‌లం 25శాతం లివ‌ర్‌తో బ‌తుకుతున్నాన‌ని చెప్పారు. 75 శాతం లివ‌ర్ హెప‌టైటిస్ బి వైర‌స్ కార‌ణంగా పాడైపోయింద‌న్నారు. గతంలో కూలీ అనే సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంద‌ర్భంలో ఆయ‌న ఈ ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌య్యారు. హెప‌టైటిస్ వ్యాధిపై మీడియా ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అమితాబ్ ఈ వివ‌రాలు తెలియ‌జేశారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం- అమితాబ్ యాక్సిడెంట్‌కి గుర‌యిన‌పుడు దాదాపు 200మంది ఆయ‌న‌కు […]

పాతిక‌శాతం లివ‌ర్‌తోనే బ‌తుకుతున్నా..!
X

అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ఆరోగ్యం గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాలు వెల్ల‌డించారు. తాను కేవ‌లం 25శాతం లివ‌ర్‌తో బ‌తుకుతున్నాన‌ని చెప్పారు. 75 శాతం లివ‌ర్ హెప‌టైటిస్ బి వైర‌స్ కార‌ణంగా పాడైపోయింద‌న్నారు. గతంలో కూలీ అనే సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంద‌ర్భంలో ఆయ‌న ఈ ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌య్యారు. హెప‌టైటిస్ వ్యాధిపై మీడియా ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అమితాబ్ ఈ వివ‌రాలు తెలియ‌జేశారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం-

అమితాబ్ యాక్సిడెంట్‌కి గుర‌యిన‌పుడు దాదాపు 200మంది ఆయ‌న‌కు ర‌క్తదానం చేశారు. 60 బాటిల్స్ ర‌క్తం ఎక్కించారు. అప్ప‌టికి ఆస్ట్రేలియా నుండి సంక్ర‌మించిన ఈ హెప‌టైటిస్ బి వైర‌స్‌ని క‌నుగొని మూడునెల‌లు మాత్ర‌మే అయ్యింది. ఆరోజుల్లో దాన్ని క‌నుగొనేందుకు వివిధ ప‌రీక్ష‌లు చేయాల్సి వ‌చ్చేది. ఆ ప‌రీక్ష‌లు కూడా అప్పుడ‌ప్పుడే వెలుగులోకి వ‌స్తున్న‌వి. ఆ కార‌ణంగా ఆయ‌న‌కు ఎక్కించిన ర‌క్తంలో ఈ వైర‌స్ ఉందో లేదో తెలుసుకునే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. అలా అమితాబ్ త‌న‌కు ఎక్కించిన ర‌క్తం ద్వారా హెప‌టైటిస్ బికి గుర‌య్యారు. అయితే యాక్సిడెంట్ త‌రువాత 18 సంవ‌త్స‌రాల పాటు అంటే 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ అనారోగ్యం బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఆ త‌రువాతే ఒక సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌ల్లో అమితాబ్‌కి హెప‌టైటిస్ బి ఉన్న‌ట్టుగా తేలింది. ఆయ‌న లివ‌ర్లో 75శాతం ఇన్‌ఫెక్ష‌న్‌కి గుర‌య్యింద‌ని, 25శాతం మాత్ర‌మే బాగుంద‌ని వైద్యులు చెప్పారు.

ఈ వివ‌రాల‌ను తెలియ‌జేసిన అమితాబ్ బ‌చ్చ‌న్ ఇది బాధాక‌రమే అయినా, మ‌నం 12శాతం లివ‌ర్‌తోనే బ‌త‌గ‌లం అనేది మాత్రం నిజంగా ఒక శుభ‌వార్తే అన్నారు. ఈ సంద‌ర్భంగా అమితాబ్ మ‌న‌దేశంలో ఉన్న వైద్య సౌక‌ర్యాల మీద‌, మ‌న డాక్ట‌ర్ల‌మీద ప్ర‌శంస‌లు కురిపించారు. టిబి, హెప‌టైటిస్ బి చికిత్స‌ల్లో భార‌త్ అద్వితీయంగా ఉంద‌న్నారు. తాను భార‌తీయ వైద్యుల ప‌ట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న‌ట్టుగా తెలిపారు. త‌న‌ వ్యాధి విష‌యంలో విదేశాల్లో సెకండ్ ఒపీనియ‌న్ తీసుకున్నా, మ‌న వైద్యుల స్థాయి కూడా అందుకు స‌మానంగా ఉంద‌ని ఆయ‌న కితాబునిచ్చారు.

First Published:  24 Nov 2015 7:02 PM GMT
Next Story