Telugu Global
Cinema & Entertainment

తెలుగు నిర్మాతలను మోహ‌న్‌రెడ్డి బెదిరించాడా..? 

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో మాఫియా ఉదంతం వెలుగు చూసింది. 2010లో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ హ‌త్య త‌రువాత ఇలాంటి ఆరోప‌ణ‌లే వెలుగుచూశాయి. అప్ప‌ట్లో హ‌త్య‌కు గురైన స‌ద‌రు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ బినామీతో సంబంధాలున్నాయ‌న్న కార‌ణంతో  కొంద‌రు సినిమా నిర్మాత‌ల‌పైనా పోలీసులు కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.  తాజాగా కరీంన‌గ‌ర్ జిల్లాలో వ‌డ్డీ వ్యాపారం చేసి, ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్ఐ మోహ‌న్ రెడ్డి కి సంబంధించిన ప‌లు ఆస‌క్తికర విష‌యాలు ఒక్కొక్క‌టిగా […]

తెలుగు నిర్మాతలను మోహ‌న్‌రెడ్డి బెదిరించాడా..? 
X
తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో మాఫియా ఉదంతం వెలుగు చూసింది. 2010లో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ హ‌త్య త‌రువాత ఇలాంటి ఆరోప‌ణ‌లే వెలుగుచూశాయి. అప్ప‌ట్లో హ‌త్య‌కు గురైన స‌ద‌రు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ బినామీతో సంబంధాలున్నాయ‌న్న కార‌ణంతో కొంద‌రు సినిమా నిర్మాత‌ల‌పైనా పోలీసులు కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా కరీంన‌గ‌ర్ జిల్లాలో వ‌డ్డీ వ్యాపారం చేసి, ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్ఐ మోహ‌న్ రెడ్డి కి సంబంధించిన ప‌లు ఆస‌క్తికర విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మోహ‌న్‌రెడ్డితో సంబంధ‌మున్న ప‌లువురు ఉన్న‌తాధికారుల‌పై ఇప్ప‌టికే పోలీసు డిపార్ట్‌మెంట్‌ శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రెడ్డి వ‌డ్డీ మాఫియా నెట్‌వ‌ర్క్ తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు విస్త‌రించింద‌ని ఈ కేసు ద‌ర్యాప్తు చేస్తోన్న‌ సీఐడీ, ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో తెలుగు నిర్మాత‌ల్లో ఆందోళ‌న రేగుతోంది. మోహ‌న్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 80 డాక్యుమెంట్ల‌లో ప‌లువురు తెలుగు నిర్మాతల పేర్లు ఉండ‌టం పోలీసుల‌ను విస్మ‌యానికి గురిచేసింది. అయినా, రూ.500 కోట్ల మేర ఆస్తులు కూడ‌బెట్టిన మోహ‌న్‌రెడ్డి రూ.10కోట్లు, రూ.20 కోట్ల మేర సినిమాల‌కు ఫైనాన్స్ చేయ‌డం పెద్ద విష‌య‌మేం కాదు.
నిర్మాత‌ల త‌ప్పేముంది?
నిర్మాత‌ల‌కు ఫైనాన్షియ‌ర్లు త‌ప్ప‌కుండా అవ‌స‌ర‌మే! అయితే, వారి నేప‌థ్యం ఎలాంటిదో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం, అంత టైం నిర్మాత‌ల‌కు ఉండ‌దుగాక ఉండ‌దు. ఫైనాన్షియ‌ర్ చ‌రిత్ర గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెడితే.. ఏ ఫైనాన్షియ‌రూ డ‌బ్బులు ఇచ్చేందుకు ముందుకు రాడ‌న్న‌ది వాస్త‌వం. డ‌బ్బు అవ‌స‌రం ఉంది కాబట్టి తీసుకున్నారు. పైగా అన్నింటికీ లెక్కా ప‌త్రాలు స‌రిగ్గానే ఉన్నాయి. అలాంట‌పుడు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌మేం లేద‌ని మోహ‌న్‌రెడ్డి వ‌ద్ద అప్పు తీసుకున్న నిర్మాత‌ల‌కు తోటి నిర్మాత‌లు స‌ర్ది చెబుతున్నారంట‌. 2010లో ఓ ఫ్యాక్ష‌న్ నేత బినామీ కొంద‌రు నిర్మాత‌లను బెదిరించాడ‌ని, బ్లాక్ మెయిల్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డం తెలుగు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపింది. మోహ‌న్‌రెడ్డి బాధితుల్లో తెలుగు నిర్మాతలు ఎవ‌రైనా త‌మ‌ ఆస్తులు రాసి ఇచ్చారా? ఎవ‌రినైనా మోహ‌న్‌రెడ్డి బెదిరించాడా? అన్న చ‌ర్చ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో మొద‌లైంది. కేసు వేగం పెంచిన సీఐడీ అధికారులు ఈ వివ‌రాల‌నూ కూపీలాగే ప‌నిలో ఉన్నారు.
First Published:  24 Nov 2015 7:06 PM GMT
Next Story