Telugu Global
Others

అన్నదాతకు అవమానం " మెడలో పలకలేస్తున్న బాబు ప్రభుత్వం

ఆత్మగౌరవమే ఆభరణంగా బతికే రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రైతుల నిస్సహాయతను అలుసుగా తీసుకుని నేరస్తుల తరహాలో చేతిలో పలకపెట్టి ఫోటోలు తీస్తున్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు నష్టం పరిహారం కోసం ఈ అవమానాన్ని మౌనంగా భరిస్తున్నారు. అయితే రైతుల మెడలో పలకలు వేయడానికి మార్గదర్శి చంద్రబాబేనని చెబుతున్నారు. విషయమేమిటంటే… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోనూ వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు బాధతో […]

అన్నదాతకు అవమానం  మెడలో పలకలేస్తున్న బాబు ప్రభుత్వం
X

ఆత్మగౌరవమే ఆభరణంగా బతికే రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రైతుల నిస్సహాయతను అలుసుగా తీసుకుని నేరస్తుల తరహాలో చేతిలో పలకపెట్టి ఫోటోలు తీస్తున్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు నష్టం పరిహారం కోసం ఈ అవమానాన్ని మౌనంగా భరిస్తున్నారు. అయితే రైతుల మెడలో పలకలు వేయడానికి మార్గదర్శి చంద్రబాబేనని చెబుతున్నారు. విషయమేమిటంటే…

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోనూ వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు బాధతో కుమిలిపోతున్నారు. ఈ సమయంలో పంట నష్టం అంచనా పేరుతో పొలాల వెంబడి అధికారులు తిరుగుతున్నారు. ఇక్కడే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. రైతుల మనోభావాలతో సంబంధం లేకుండా దెబ్బతిన్న పంటపొలంలో రైతులను నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. అది కూడా నేరస్తులకు ఫోటోలు తీసినట్టుగా రైతుల చేతిలో పలక పెట్టి దానిపై వివరాలు రాసి నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. ఇలా పలక ఫోటోలకు చాలా మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. తామేమైనా నేరస్తులమా… .నష్టపరిహారం కోసం తమ మెడల్లో పలకలేసి ఫోటోలు తీస్తారా అని నిలదీస్తున్నారు.

కొందరు రైతులు నేరుగా స్థానిక ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి విషయంపై నిలదీశారు. పేద రైతులు మాత్రం వ్యతిరేకిస్తే ఎక్కడ పరిహారం అందదోనన్న భయంతో మనసు చంపుకుని పలక ఫోటోలకు అంగీకరిస్తున్నారు. ఈ విషయంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు విషయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి దృష్టికి తీసుకెళ్లారు.

అధికారులు ఇలా చేయడానికి చంద్రబాబే మార్గదర్శి అని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల అమరావతి శంకుస్థాపన సందర్బంగా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఇలాగే పలక ఫోటోలు దిగారు. దాన్ని చూపి స్పూర్తి పొందిన అధికారులు ఇలా రైతుల ఆత్మగౌరవంపై ప్రయోగాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా ఏపీలోని మిగిలిన జిల్లాల్లోనూ ఈ పలక ఫోటోల తంతు నడుస్తోంది.

Click to Read: Hattrick hero after Udayakiran

First Published:  24 Nov 2015 10:42 PM GMT
Next Story