Telugu Global
National

ఇక బ్యాంకులను మోసం చేయడం కుదరదు

రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సలహాతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో మొండి బకాయిలు భారీగా పెరిగిపోయాయని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా బ్యాంకుల పనితీరుపై పీఎస్‌యు బ్యాంకు చీఫ్‌లతో జైట్లీ భేటీ అయ్యారు. బ్యాంకులకు అధికారం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని దీని […]

ఇక బ్యాంకులను మోసం చేయడం కుదరదు
X

రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సలహాతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో మొండి బకాయిలు భారీగా పెరిగిపోయాయని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా బ్యాంకుల పనితీరుపై పీఎస్‌యు బ్యాంకు చీఫ్‌లతో జైట్లీ భేటీ అయ్యారు. బ్యాంకులకు అధికారం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని దీని వల్ల బ్యాంకులు పటిష్టంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా విజయ్‌మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారునిగా ప్రకటించిన విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసు కోవడానికి రిజర్వుబ్యాంకు బ్యాంకులకు అధికారం ఇచ్చింది. త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకుందామని జైట్లీ అన్నారు. ఈ భేటీకి ఎస్‌బీఐ చైర్ పర్సన్‌ అరుంధతి భట్టాచార్యతో పాటు పలు బ్యాంకుల చీఫ్‌లు, రిజర్వు బ్యాంకు అధికారులు హాజరయ్యారు.

First Published:  25 Nov 2015 1:06 AM GMT
Next Story