Telugu Global
Cinema & Entertainment

ర‌కుల్   సొంత గొంతు వినిపిస్తుంద‌ట‌

ప్రజెంట్ టాలీవుడ్  లో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా చేయలేని ఓ సాహసం, ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్ లోనే చేసేస్తోంది. తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ పంజాబీ భామ తన నెక్ట్స్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందట. ప్రస్తుతం ఎన్టీఆర్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన […]

ర‌కుల్   సొంత గొంతు వినిపిస్తుంద‌ట‌
X

ప్రజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా చేయలేని ఓ సాహసం, ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్ లోనే చేసేస్తోంది. తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ పంజాబీ భామ తన నెక్ట్స్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందట. ప్రస్తుతం ఎన్టీఆర్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన సొంత గొంతును వినిపించడానికి రెడీ అవుతోంది.

ఇప్పటికే సినిమా ఫంక్షన్స్ లో, ప్రెస్ మీట్స్ లో తెలుగులో గలగలా మాట్లాడేస్తున్న రకుల్ డబ్బింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా పదాలు సరిగ్గా పలకటం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుంది. అయితే ఈ సినిమాలో… లండన్ లో నివసించే తెలుగు అమ్మాయి పాత్రలో నటిస్తుంది కాబట్టి, తెలుగు ఉచ్ఛారణ కాస్త అటుఇటుగా ఉన్నా ఫరవాలేదనే ఉద్దేశంతో.. చిత్ర యూనిట్ రకుల్ సొంతం గొంతుకు ఓటు వేశారు. మరి ఇన్నాళ్లు అరువు గొంతుల మీద ఆధారపడ్డ ఈ భామ, సొంత గొంతుతో ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

First Published:  23 Nov 2015 7:08 PM GMT
Next Story