Telugu Global
Others

ఇప్పుడు తెలుస్తుంది ఎవరి వెయిట్‌ ఎంతో ..?

ఇటీవల తెలంగాణకు కేవలం పది వేల ఇళ్లను కేటాయించిన కేంద్రం.. ఏపీకి మాత్రం ఏకంగా లక్షా 98 వేల ఇళ్లను కేటాయించి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కేంద్రంలో చంద్రబాబు పలుకుబడికి ఇళ్ల కేటాయింపులే నిదర్శనమని టీడీపీ నేతలు చెప్పారు. అయితే ఇళ్ళు కేటాయించిన పట్టణాభివృద్ధి శాఖ చంద్రబాబుకు సన్నిహితుడైన వెంకయ్యనాయుడు చేతుల్లో ఉండడం ఇక్కడ గమనించాలి. అయితే మోదీ వద్ద చంద్రబాబు పరపతి ఎంతుందన్న విషయం వరద సాయం ద్వారా తెలిసిపోతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా తమిళనాడుతో […]

ఇప్పుడు తెలుస్తుంది ఎవరి వెయిట్‌ ఎంతో ..?
X

ఇటీవల తెలంగాణకు కేవలం పది వేల ఇళ్లను కేటాయించిన కేంద్రం.. ఏపీకి మాత్రం ఏకంగా లక్షా 98 వేల ఇళ్లను కేటాయించి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కేంద్రంలో చంద్రబాబు పలుకుబడికి ఇళ్ల కేటాయింపులే నిదర్శనమని టీడీపీ నేతలు చెప్పారు. అయితే ఇళ్ళు కేటాయించిన పట్టణాభివృద్ధి శాఖ చంద్రబాబుకు సన్నిహితుడైన వెంకయ్యనాయుడు చేతుల్లో ఉండడం ఇక్కడ గమనించాలి. అయితే మోదీ వద్ద చంద్రబాబు పరపతి ఎంతుందన్న విషయం వరద సాయం ద్వారా తెలిసిపోతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా తమిళనాడుతో పోల్చి లెక్కలు చెబుతున్నారు.

ఏపీలోని నెల్లూరు, కడప, చిత్తూరుతోపాటు తమిళనాడు తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. జయ ప్రభుత్వం రెండు వేల కోట్ల ఆర్థిక సాయం అడగ్గా కేంద్రం తక్షణ సాయం కింద రూ. 924 కోట్లు ప్రకటించింది. మలేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ…ఈ మేరకు వరద సాయం విడుదల చేయాలని సోమవారం అధికారులు ఆదేశించారు. రెండు వేల కోట్లు అడిగితే తక్షణ సాయం కింద 924 కోట్లు కేటాయించడం పెద్ద మొత్తమేనని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు కూడా కేంద్రానికి సాయంపై లేఖ రాశారు. ప్రాథమికంగా 3000 కోట్ల నష్టం వాటిల్లిందని… తక్షణ సాయం కింద 1000 కోట్లు అందజేయాలని విజ్జప్తి చేశారు. త్వరలోనే జరిగిన మొత్తం నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని లేఖలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏపీకి సాయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ తరపున కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడుకు తగ్గకుండా సాయం చేస్తారా లేక హుద్‌హుద్‌ సమయంలోలాగే హ్యాండిస్తారా అన్నది తేలాలి. హుద్‌హుద్‌ సమయంలోనూ రాష్ట్ర్ర ప్రభుత్వం 25 వేల కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పింది. కానీ కేంద్రం మాత్రం తక్షణసాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించి… చివరకు అందులో సగం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదు. అయితే…కొందరు మాత్రం మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతంలో విపత్తుల సమయంలో కేంద్రం అందజేసిన నిధులను ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై తిరిగి లెక్కలు చెప్పాల్సి ఉంటుందని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం హుద్‌హుద్‌ ఖర్చులను కేంద్రానికి పంపిందా లేదా అన్నది ఇప్పుడు తెలియాలంటున్నారు. ఆ విషయాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే విపత్తు సమయంలో పాత విషయాలను తెరపైకి తెచ్చి సాయం నిలిపివేసే అవకాశం ఉండదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Also Read Name game fails in tollywood

First Published:  23 Nov 2015 6:06 AM GMT
Next Story