Telugu Global
Cinema & Entertainment

నాన్న‌కు ప్రేమ‌తో నిర్మాత‌ల‌కు బ‌డ్జెట్‌ బెంగ‌

టెంప‌ర్ త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా నాన్న‌కు ప్రేమ‌తో!  ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్ర‌యిల‌ర్ సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! సంక్రాంతికి విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించ‌డంతో సినిమా పనులు వేగంగా న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే దాదాపు 90  రోజులు విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ సినిమా మిగిలిన టాకీ ప్ర‌స్తుతం ఇండియాలో షూట్ చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ, బ‌డ్జెట్ విష‌యంలో కొన్నిరోజులుగా నిర్మాతల్లో కంగారు మొద‌లైంద‌ని స‌మాచారం. పెద్ద‌హీరో సినిమా అంటే.. […]

నాన్న‌కు ప్రేమ‌తో నిర్మాత‌ల‌కు బ‌డ్జెట్‌ బెంగ‌
X
టెంప‌ర్ త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా నాన్న‌కు ప్రేమ‌తో! ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్ర‌యిల‌ర్ సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! సంక్రాంతికి విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించ‌డంతో సినిమా పనులు వేగంగా న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే దాదాపు 90 రోజులు విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ సినిమా మిగిలిన టాకీ ప్ర‌స్తుతం ఇండియాలో షూట్ చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ, బ‌డ్జెట్ విష‌యంలో కొన్నిరోజులుగా నిర్మాతల్లో కంగారు మొద‌లైంద‌ని స‌మాచారం. పెద్ద‌హీరో సినిమా అంటే.. కాస్త అటూ ఇటూగా రూ.40-45 కోట్లుగా ప‌రిమితి పెట్టుకుంటారు తెలుగు నిర్మాత‌లు. కానీ, ఈచిత్రం బ‌డ్జెట్ ఇప్ప‌టికే రూ.50 కోట్ల మార్కును చేరుకోవ‌డం నిర్మాత‌లను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యేలోగా బ‌డ్జెట్ మ‌రింత పెరుగుతుందన‌డంలో సందేహం లేదు.
సుకుమార్‌, ఎన్టీఆర్‌ల‌పైనే..!
బ‌డ్జెట్ కాస్త ఎక్కువైనా సుకుమార్‌, ఎన్టీఆర్‌ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు నిర్మాత‌లు. ఇటీవ‌ల విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌ను 4 మిలియ‌న్ల (అంటే 40 ల‌క్ష‌ల మంది)కు పైగా వీక్షించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇత‌ర వీడియోల‌ను వేల‌ల్లో వీక్షిస్తున్నారు. ఇక సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లోనూ కావాల్సినంత ప్ర‌చారం దొరుకుతోంది. ఇవ‌న్నీ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌నే తీసుకొస్తాయ‌న్న న‌మ్మ‌కం రావ‌డంతో బ‌డ్జెట్ ఎక్కువైనా ఫ‌ర్వాలేదు అని నిర్మాత‌లు స‌రిపెట్టుకుంటున్నారు. పైగా సుకుమార్ సినిమా ఒక‌టి ఆడితే మ‌రొటి ఆడ‌దు. ఆ లెక్క‌న 1- నేనొక్క‌డినే ఢ‌మాల్ అన‌డంతో ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న సెంటిమెంట్ ను కూడా గుర్తు చేసుకుంటూ ముందుకుపోతున్నారు. పైగా టెంప‌ర్ సినిమాతో ఇండ‌స్ర్టీలో త‌న టెంప‌రేచ‌ర్ ఎంతో మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. తాజా సినిమాతో మ‌రోసారి వ‌సూళ్ల సునామీ కురుస్తుంద‌ని చాలా ఆశ‌లు పెట్టుకున్నారు నిర్మాత‌లు.
Next Story