Telugu Global
Cinema & Entertainment

సుకుమార్ లైఫ్‌లో క్యారెక్టర్ కథే 'కుమారి 21F'

మొదటినుండీ ప్రచారం చేస్తూనే ఉన్నారు సుకుమార్ & టీం… ‘కుమారి 21F’ తన నిజ జీవిత అనుభవాలనుండి పుట్టిన కథ అని. అంత బోల్డ్ క్యరెక్టర్ నిజంగా సుకుమార్ లైఫ్‌లో ఉందా? ఉంటే ఆమె ఎవరు? సుకుమార్ లవ్‌లో పడ్డాడా? అతని లవర్ ఎవరు అనే ప్రశ్నలు రాక మానవు.. ‘కుమారి 21F’ ప్రచార శైలి చూస్తుంటే. అదే ప్రశ్న మీడియా అడిగితే, ‘అలా అడిగేసారు ఏంటండీ?’ అని సుకుమార్ సిగ్గుతో తిరుగు ప్రశ్న వేసినా, అందరిలాగే […]

సుకుమార్ లైఫ్‌లో క్యారెక్టర్ కథే కుమారి 21F
X

మొదటినుండీ ప్రచారం చేస్తూనే ఉన్నారు సుకుమార్ & టీం… ‘కుమారి 21F’ తన నిజ జీవిత అనుభవాలనుండి పుట్టిన కథ అని. అంత బోల్డ్ క్యరెక్టర్ నిజంగా సుకుమార్ లైఫ్‌లో ఉందా? ఉంటే ఆమె ఎవరు? సుకుమార్ లవ్‌లో పడ్డాడా? అతని లవర్ ఎవరు అనే ప్రశ్నలు రాక మానవు.. ‘కుమారి 21F’ ప్రచార శైలి చూస్తుంటే. అదే ప్రశ్న మీడియా అడిగితే, ‘అలా అడిగేసారు ఏంటండీ?’ అని సుకుమార్ సిగ్గుతో తిరుగు ప్రశ్న వేసినా, అందరిలాగే తాను ఒకప్పుడు లవ్ చేసానని.. కాని దూరంగా చూసేవాడినే కాని, కనీసం ఆమెకు చెప్పే ధైర్యం లేదని సుకుమార్ అంటున్నాడు.

తాను ప్రపోజ్ చేసే రకం కాదని, ఆమే ప్రపోజ్ చేయాలని కోరుకునే సిగ్గరి రకం అంటున్నాడు. మరి తన మొదటి ప్రొడక్షన్ ‘కుమారి 21F’ కుమారి క్యారెక్టర్ అలా పుట్టిందేనా అడిగితే.. తన కాలేజ్ లైఫ్‌ని నెమరు వేసుకున్నాడు సుకుమారుడు. కాలేజ్‌లో ఒక అమ్మాయి చాలా డేరింగ్‌గా ఉండేదని, ఒకసారి ఆమె 5గురు అబ్బాయిలతో పిక్నిక్ వెళ్ళిందని, తిరిగి వచ్చాక అందరూ ఆమెను ‘లూజ్ క్యారెక్టర్’ గా అనుకుని ప్రచారం చేసారని, ఆ సంఘటన చాలా రోజుల వరకు తన మదిలో ఉండిపోయిందని.. అదే ఈ కథకు ప్రేరణ అని సుకుమార్ వివరించాడు. ఆ రోజుల్లో అబ్బాయిలతో అమ్మాయి ఒంటరిగా పిక్నిక్ వెళ్ళడం అంటే చాలా బోల్డ్ అని అనుకోవడం నిజమే కదా!

First Published:  21 Nov 2015 7:07 PM GMT
Next Story