Telugu Global
Others

జ్యోతిలక్ష్మి నడుము కొలిచేంత తీరిక లేదు

ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోటి నుంచి తరచు సినీ తారల పేర్లు   వస్తున్నాయి. దేనికైనా ఉదాహరణ చెప్పాలంటే హీరోయిన్ల పేర్లను వాడుకుంటున్నారు. హీరోయిన్ సమంత చీరకడితే ఆశ్చర్యం లేదని బ్రిటన్ ప్రధాని కెమరూన్‌ భార్య సమంత చీర కడితేనే ఆశ్చర్యమంటూ ఇటీవల వెంకయ్య వ్యాఖ్యానించారు. తాజాగా వెంకయ్య నోటి నుంచి జ్యోతి లక్ష్మి పేరు వచ్చింది.   ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ‘‘వెంకయ్య నాలుకకు నరం లేదు. అది జ్యోతిలక్ష్మి నడుములా ఎటుబడితే అటు తిరుగుతుంది’’ […]

జ్యోతిలక్ష్మి నడుము కొలిచేంత తీరిక లేదు
X

ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోటి నుంచి తరచు సినీ తారల పేర్లు వస్తున్నాయి. దేనికైనా ఉదాహరణ చెప్పాలంటే హీరోయిన్ల పేర్లను వాడుకుంటున్నారు. హీరోయిన్ సమంత చీరకడితే ఆశ్చర్యం లేదని బ్రిటన్ ప్రధాని కెమరూన్‌ భార్య సమంత చీర కడితేనే ఆశ్చర్యమంటూ ఇటీవల వెంకయ్య వ్యాఖ్యానించారు. తాజాగా వెంకయ్య నోటి నుంచి జ్యోతి లక్ష్మి పేరు వచ్చింది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ‘‘వెంకయ్య నాలుకకు నరం లేదు. అది జ్యోతిలక్ష్మి నడుములా ఎటుబడితే అటు తిరుగుతుంది’’ అని సీపీఐ నారాయణ ఎద్దేవా చేసిన నేపథ్యంలో వెంకయ్య స్పందించారు. తనకు జ్యోతి లక్ష్మి నడుము కొలిచేంత తీరిక లేదని మీడియాతో వెంకయ్యనాయుడు చెప్పారు. తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. కాలం చెల్లిన కమ్యూనిజాన్ని పట్టుకుని కొందరు ఏవేవో కొలతలు వేస్తున్నారని వెంకయ్య రివర్స్ పంచ్ వేశారు.

First Published:  20 Nov 2015 10:15 PM GMT
Next Story