Telugu Global
Others

టీవీఎస్‌ కూతురు నుంచి విడిపోయిన ఇన్పోసిస్ మూర్తి కొడుకు

మరో హైప్రొఫైల్ జంట విడిపోయింది. ఇన్పోసిస్ నారాయణమూర్తి కూమారుడు రోహన్‌ మూర్తి , అతడి భార్య లక్ష్మి వేణు   విడిపోయారు. వీరికి  చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. లక్ష్మి వేణు ప్రముఖ మోటర్ కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కూమార్తె. వీరికి 2011 జూన్‌లో ఘనంగా వివాహమైంది. బెంగళూరులో అంగరంగవైభవంగా రిసెప్షన్ జరిగింది. ఆ ఏడాదిలో బెంగళూరు సిటీలోనే అంత ఘనంగా రిసెప్ఫన్ జరగలేదని చెబుతుంటారు. రెండుళ్లుగా రోహన్, లక్ష్మి వేరుగానే ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరు విడాకులకు […]

టీవీఎస్‌ కూతురు నుంచి విడిపోయిన ఇన్పోసిస్ మూర్తి కొడుకు
X

మరో హైప్రొఫైల్ జంట విడిపోయింది. ఇన్పోసిస్ నారాయణమూర్తి కూమారుడు రోహన్‌ మూర్తి , అతడి భార్య లక్ష్మి వేణు విడిపోయారు. వీరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. లక్ష్మి వేణు ప్రముఖ మోటర్ కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కూమార్తె. వీరికి 2011 జూన్‌లో ఘనంగా వివాహమైంది. బెంగళూరులో అంగరంగవైభవంగా రిసెప్షన్ జరిగింది. ఆ ఏడాదిలో బెంగళూరు సిటీలోనే అంత ఘనంగా రిసెప్ఫన్ జరగలేదని చెబుతుంటారు.
రెండుళ్లుగా రోహన్, లక్ష్మి వేరుగానే ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరు విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన లక్ష్మి సోదరుడి వివాహానికి కూడా నారాయణమూర్తి ఫ్యామిలీ హాజరుకాలేదు. అప్పుడే వీరు వేరుగా ఉంటున్న విషయం బయటపడింది.

First Published:  21 Nov 2015 4:24 AM GMT
Next Story