Telugu Global
Cinema & Entertainment

 అఖిల్  సినిమా చివర‌కు ఏమి మిగిల్చింది..?

అక్కినేని  మూడో త‌రం న‌ట వార‌సుల్లో  చిన్న‌వాడిగా ఎంట్రీ అచ్చిన అఖిల్   విజ‌య వంతం అయ్య‌డా..?  అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాడా..?  అంచ‌నాలు  మించి వున్నాడా..?  అస‌లు స్టార్ హీరో అయ్యే ల‌క్ష‌ణాలు వున్నాయా..?   అప్పుడే  హీరోగా ఎంట్రీ  ఇవ్వ‌డం  తొంద‌ర‌పాటు చ‌ర్యా..?   ద‌ర్శ‌కుడిగా అఖిల్ ను    వివి వినాయ‌క్  సూప‌ర్ లాంచ్ చేయ‌గ‌లిగాడా..? అస‌లేమి జ‌రిగింది.?  అలాగే నిర్మాత‌గా  భారాని బుజానా వేసుకున్న   నితిన్ ఎంత వ‌రుకు బిజినెస్ ప‌రంగా ఒడ్డున్న ప‌డ్డాడు..? ఇటువంటి సందేహాలు చాల వున్నాయి. […]

 అఖిల్  సినిమా చివర‌కు ఏమి మిగిల్చింది..?
X

అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుల్లో చిన్న‌వాడిగా ఎంట్రీ అచ్చిన అఖిల్ విజ‌య వంతం అయ్య‌డా..? అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాడా..? అంచ‌నాలు మించి వున్నాడా..? అస‌లు స్టార్ హీరో అయ్యే ల‌క్ష‌ణాలు వున్నాయా..? అప్పుడే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యా..? ద‌ర్శ‌కుడిగా అఖిల్ ను వివి వినాయ‌క్ సూప‌ర్ లాంచ్ చేయ‌గ‌లిగాడా..? అస‌లేమి జ‌రిగింది.? అలాగే నిర్మాత‌గా భారాని బుజానా వేసుకున్న నితిన్ ఎంత వ‌రుకు బిజినెస్ ప‌రంగా ఒడ్డున్న ప‌డ్డాడు..? ఇటువంటి సందేహాలు చాల వున్నాయి.

అయితే సినిమా రిలీజ్ అయిన త‌రువాత డే వ‌న్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ రావ‌డం తో అంచ‌నాలు రీచ్ కాలేక పోయేంద‌ని తేలింది. అస‌లు తెరంగ‌ట్రాన్ని సింపుల్ గా చేసి.. ఆడియో రిలీజ్ రోజు కాస్త హ‌డావుడి చేసి.. అఖిల్ సినిమాకు రిలీజ్ అయిన త‌రువాత ఎక్కువ ప్ర‌మోష‌న్ పెట్టి న‌ట్లు అయితే ఇది వ‌ర్కువుట్ అయ్యేది. కానీ.. రిలీజ్ కు ముందే వీప‌రీత‌మైన హైపు క్రియేట్ చేయ‌డం..దానికి తోడు హీరో మ‌రి చిన్న పిల్లాడు అనే విధంగా ఉండ‌టం.. క‌థ‌, క‌థ‌నాలు అంత‌గా లేక పోవ‌డం. తో అఖిల్ చిత్రం ఒక స‌గుటు సినిమాగా మాత్ర‌మే మిగిలింది. బ‌డ్జెట్ ప‌రంగా బ‌య‌ట ప‌డ‌టం లేదు కానీ.. నిర్మాత సినిమాను అమ్ముకుని సేఫ్ అయ్యిండోచ్చు కానీ.. కొన్న బ‌య్య‌ర్లు మాత్రం బాగా న‌ష్ట‌పోయార‌నే టాక్ వినిపిస్తుంది . మొత్తం మీద అఖిల్ సినిమా నిరాశ మిగిల్చింద‌నే చెప్పాలి.

First Published:  20 Nov 2015 7:03 PM GMT
Next Story