Telugu Global
Others

గళమెత్తిన అంగన్‌వాడీలు.. బొమ్మ మాత్రం కనిపించలేదే?

ఏపీలో అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి నినదించారు. ప్రభుత్వం పెంచిన జీతాలను వెంటనే అమలు చేసేలా జీవో విడుదల చేయాలంటూ 13 జిల్లాల్లోనూ నినదించారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకుంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏస్థాయిలో ఉద్యమం చేశామో అంతకంటే ఉధృతంగా పోరు చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో డిమాండ్ల పరిష్కరానికి అంగన్‌వాడీలు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగగా… అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించింది. మహిళలను గుర్రాలతో తొక్కించారు. ఆ […]

గళమెత్తిన అంగన్‌వాడీలు.. బొమ్మ మాత్రం కనిపించలేదే?
X

ఏపీలో అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి నినదించారు. ప్రభుత్వం పెంచిన జీతాలను వెంటనే అమలు చేసేలా జీవో విడుదల చేయాలంటూ 13 జిల్లాల్లోనూ నినదించారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకుంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏస్థాయిలో ఉద్యమం చేశామో అంతకంటే ఉధృతంగా పోరు చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో డిమాండ్ల పరిష్కరానికి అంగన్‌వాడీలు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగగా… అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించింది. మహిళలను గుర్రాలతో తొక్కించారు. ఆ ఘటన ఇప్పటికీ చంద్రబాబు రాజకీయ చరిత్రలో మచ్చలా మిగిలిపోయింది. ప్రత్యర్థులు తరుచూ ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు.

శుక్రవారం శ్రీకాకుళంజిల్లా టెక్కిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్‌వాడీ వర్కర్లు ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో అంగన్‌వాడీ వర్కర్లు ధర్నాకు దిగారు. పెంచిన వేతనాలకు సంబంధించి జీవోను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ, పింఛను సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లాలో ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. కడప జిల్లా జమ్మలమడుగులో అంగన్ వాడీ వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ఎండీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కారించాలని లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇలా 13 జిల్లాలోనూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అయితే తెలంగాణలో ఆశ వర్కర్లు ఆందోళనను ఓరేంజ్‌లో చూపిన మీడియా తమ ఆందోళనను మాత్రం బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తోందని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  20 Nov 2015 6:48 PM GMT
Next Story