Telugu Global
Cinema & Entertainment

డిక్టేర్  ఆడియో అమ‌రావ‌తి లో..!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌. ‘లౌక్యం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ […]

డిక్టేర్  ఆడియో అమ‌రావ‌తి లో..!
X

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌. ‘లౌక్యం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు.

ప్రపంచ శాంతిదూత గౌతమబుద్ధుడు నడయాడిన నేలగా పేరుగాంచిన అమరావతిలో ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇటీవల కాలచక్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతిలో జరగున్ను వేడుక ‘డిక్టేటర్‌’ చిత్ర ఆడియో విడుదల. అంతే కాకుండా అమరావతిలో జరుగనున్న తొలి సినిమా కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు కూడా తరలిరానున్నారు.మొత్తం మీద ఆంధ్ర రాజ‌ధానిగా శంఖు స్థాప‌న జ‌రిగిన త‌రువాత‌.. అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌బోతున్న మొట్ట మొద‌టి ఫిల్మ్ ఈవెంట్ డిక్టేటేర్ దే కానుందన్న‌మాట‌.

First Published:  19 Nov 2015 8:26 PM GMT
Next Story