Telugu Global
Cinema & Entertainment

స‌రైనోడికి స‌రైన స‌మ‌యం ఏదీ?

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో స‌రైనోడుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు అల్లు అర్జున్. రేసు గుర్రం త‌రువాత వ‌చ్చిన స‌న్నాఫ్ స‌త్యమూర్తి వ‌సూళ్లు ఫ‌ర‌వాలేద‌నిపించినా హిట్ టాక్ తెచ్చుకోలేక‌పోయింది. స‌రైనోడుతో భారీ హిట్ కొట్టి స‌త్య‌మూర్తి మిగిల్చిన లోటును భ‌ర్తీ చేసుకుందామ‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు బ‌న్నీ. అయితే, అంతా బానే ఉంది అనుకుంటున్న స‌మ‌యంలో బ‌న్నీకి పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. స‌రైనోడు పూర్తిస్థాయి యాక్ష‌న్ సినిమా కావ‌డంతో స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. ఏప్రిల్ రెండోవారంలో స‌రైనోడిని దించుతామ‌నుకుంటే.. […]

స‌రైనోడికి స‌రైన స‌మ‌యం ఏదీ?
X
బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో స‌రైనోడుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు అల్లు అర్జున్. రేసు గుర్రం త‌రువాత వ‌చ్చిన స‌న్నాఫ్ స‌త్యమూర్తి వ‌సూళ్లు ఫ‌ర‌వాలేద‌నిపించినా హిట్ టాక్ తెచ్చుకోలేక‌పోయింది. స‌రైనోడుతో భారీ హిట్ కొట్టి స‌త్య‌మూర్తి మిగిల్చిన లోటును భ‌ర్తీ చేసుకుందామ‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు బ‌న్నీ. అయితే, అంతా బానే ఉంది అనుకుంటున్న స‌మ‌యంలో బ‌న్నీకి పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. స‌రైనోడు పూర్తిస్థాయి యాక్ష‌న్ సినిమా కావ‌డంతో స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. ఏప్రిల్ రెండోవారంలో స‌రైనోడిని దించుతామ‌నుకుంటే.. ఆ స‌మ‌యానికి గ‌బ్బ‌ర్ సింగ్-2 అడ్డం వ‌స్తుంద‌ని తెలిసింది. పోనీ మేనెల‌లో విడుద‌ల చేద్దామ‌నుకున్నా.. ఆ స‌మ‌యానికి మ‌హేశ్ బాబు బ్ర‌హ్మోత్స‌వం క‌ర్చీఫ్ వేసుకుని ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోవ‌డం లేదంట బ‌న్నీకి. పోనీ గబ్బ‌ర్ సింగ్ కంటే ముందే అంటే మార్చి నెలాఖ‌రునాటి విడుద‌ల చేయ‌వ‌చ్చు. అప్ప‌టికీ కాలేజీల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. అస‌లే సినిమాకు రాజ‌పోష‌కులు కాలేజీ యువ‌తే కాబ‌ట్టి ఆస‌మ‌యంలో సినిమా విడుద‌లైనా ఫ‌లితం ఉండ‌దు.
పోటీ త‌ప్ప‌దా?
సినిమా విడుద‌ల‌కు స‌రైన స‌మ‌యం కుద‌ర‌క‌పోవ‌డం బ‌న్నీని, నిర్మాత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ట‌. ప్ర‌తి స‌మ్మ‌ర్‌లో కూల్‌గా సినిమాలు విడుద‌ల చేసి వ‌సూళ్లు రాబ‌ట్టుకునే బ‌న్నీ ఈసారి మ‌రో భారీ సినిమాతో ఢీకొట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అయితే, అది ఎవ‌రితో అన్న‌ది తేలాల్సి ఉంది. ప‌క్షం రోజులు అటు ఇటూ అయితే మెగాక్యాంప్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అల్లు అర్జున్ సినిమా పోటీ ప‌డ‌క త‌ప్ప‌దు. ఈ విష‌యంలో ఒక వేళ ఆల‌స్యం జ‌రిగితే మ‌హేశ్ బాబుతో త‌ల‌ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే. సినిమా పెద్ద సినిమాల‌తో పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తే.. మాట్లాడుకున్న రేటులో 30 శాతం మాత్ర‌మే ఇస్తామంటున్నార‌ట బ‌య్య‌ర్లు. దీంతో బ్మ‌హ్మోత్స‌వం, గ‌బ‌ర్బ్‌సింగ్‌-2 మ‌ధ్య క‌నీసం నాలుగు వారాల స‌మ‌యం ఉంటే బ‌న్నీకి పోటీ గండం త‌ప్పిన‌ట్లే! ఇదే ఆశ‌తో నిర్మాత‌లు సినిమా విడుద‌ల తేదీని ఇంకా ప్ర‌క‌టించలేదంట‌.
First Published:  19 Nov 2015 7:02 PM GMT
Next Story