Telugu Global
Cinema & Entertainment

అన్ని అబ‌ద్ద‌పు ప్ర‌చారాలే

నేను కనిపించకుండాపోయాననే ప్రచారం జరుగుతోంది. అవకాశాలు దూరమయ్యాయంటున్నారు. నిజానికి అదంతా అవాస్తవ ప్రచారమే అంటోంది నటి అంజలి. నిజానికి ఈ తెలుగింటి ఆడపడుచుకు కోలీవుడ్‌లో రీఎంట్రీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. మొదట్లో అంగాడీ తెరు, ఎంగేయుం ఎప్పోదుం తదితర చిత్రాల విజయాలతో జోరు మీదున్న అంజలి పినతల్లి భారతీతో మనస్పర్థల కారణంగా హైదరాబాద్ వ‌చ్చి  కొంత కాలం కోలీవుడ్‌కు దూరమయ్యారు. ఆ సమయంలో తెలుగు చిత్రాలతో బిజీ అయినా ఇటీవల సకలకళావల్లవన్ చిత్రంతో కోలీవుడ్‌కు రీఎంట్రీ […]

అన్ని అబ‌ద్ద‌పు ప్ర‌చారాలే
X

నేను కనిపించకుండాపోయాననే ప్రచారం జరుగుతోంది. అవకాశాలు దూరమయ్యాయంటున్నారు. నిజానికి అదంతా అవాస్తవ ప్రచారమే అంటోంది నటి అంజలి. నిజానికి ఈ తెలుగింటి ఆడపడుచుకు కోలీవుడ్‌లో రీఎంట్రీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. మొదట్లో అంగాడీ తెరు, ఎంగేయుం ఎప్పోదుం తదితర చిత్రాల విజయాలతో జోరు మీదున్న అంజలి పినతల్లి భారతీతో మనస్పర్థల కారణంగా హైదరాబాద్ వ‌చ్చి కొంత కాలం కోలీవుడ్‌కు దూరమయ్యారు. ఆ సమయంలో తెలుగు చిత్రాలతో బిజీ అయినా ఇటీవల సకలకళావల్లవన్ చిత్రంతో కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యారు. ఆ చిత్రం నిరాశపరచింది. దీంతో అంజలి నట పయనం నత్త నడకగా మారింది. అంజలి ఎక్కడ అనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ దుమారానికి పుల్‌స్టాప్ పెట్టే విధంగా అంజలి స్పందించారు. విరామం లేకుండా చిత్రాలు చేస్తూ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటున్నానని అంటున్న అంజలి మాట్లాడుతూ తనకు అవకాశాలు లేవు అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ప్రస్తుతం తాను బ్రేక్ లేకుండా నటిస్తున్నానని తెలిపారు. అంగాడి తెరు చిత్రానికి విరామం లేకుండా 34 గంటలు పనిచేసిన తాను తెలుగులో బాలకృష్ణకు జంటగా డిక్టేటర్ చిత్రానికి 21 గంటలు, సరైనోడు చిత్రానికి 23 గంటలు పనిచేశానన్నారు ఇక తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే విధంగా చిత్రాంగధ చిత్రానికి 44 గంటలు కంటిన్యూగా నటించినట్లు వెల్లడించారు. తమిళంలో కూడా మాప్పిళై సింగం, ఇరైవి, తరమణి చిత్రాల్లో నటిస్తున్నట్లు అంజలి పేర్కొన్నారు. ఇక అంజ‌లి శంక‌రా భ‌ర‌ణం చిత్రంలో చేసిన లేడి డాన్ రోల్ త‌న కెరీర్ కు పెద్ద ఎసెట్ అవుతుంద‌ని ఆశిస్తుంది. నిఖిల్ హీరోగా చేసిన శంక‌రాభ‌ర‌ణం చిత్రం డిసెంబ‌ర్ 4న రిలీజ్ కు సిద్దం అవుతున్న విష‌యం తెలిసిందే.

Next Story