Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌ హీరోల దారిలో ప‌వ‌న్ కళ్యాణ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! త‌న స్టార్‌డ‌మ్‌ను, వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. విష‌యం ఏంటంటే.. ఇప్పుడు ద‌క్షిణాదిన ప్ర‌త్యేక విమానంలో తిరుగుతున్న ఏకైక హీరో కూడా ప‌వ‌న్ క‌ల్యాణే కావ‌డం విశేషం. సాధార‌ణంగా సినిమా షూటింగ్‌ల‌కు అగ్ర‌ హీరోల కోసం నిర్మాత‌లు ప్ర‌త్యేక విమానం పంప‌డం మీరు చూసి ఉంటారు. మ‌న‌దేశంలో ఈ ధోర‌ణి కేవ‌లం బాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమితం. అది కూడా అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, షారూఖ్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, సైఫ్ […]

బాలీవుడ్‌ హీరోల దారిలో ప‌వ‌న్ కళ్యాణ్‌
X
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! త‌న స్టార్‌డ‌మ్‌ను, వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. విష‌యం ఏంటంటే.. ఇప్పుడు ద‌క్షిణాదిన ప్ర‌త్యేక విమానంలో తిరుగుతున్న ఏకైక హీరో కూడా ప‌వ‌న్ క‌ల్యాణే కావ‌డం విశేషం. సాధార‌ణంగా సినిమా షూటింగ్‌ల‌కు అగ్ర‌ హీరోల కోసం నిర్మాత‌లు ప్ర‌త్యేక విమానం పంప‌డం మీరు చూసి ఉంటారు. మ‌న‌దేశంలో ఈ ధోర‌ణి కేవ‌లం బాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమితం. అది కూడా అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, షారూఖ్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, సైఫ్ అలీ ఖాన్‌ లాంటి పెద్ద‌తార‌ల‌కే ఈ స‌దుపాయం ఉంది. అయితే ఇదేం వారి సొంత‌ఖ‌ర్చుల‌తో చేస్తున్న‌ది కాదు, వారి వ‌ద్ద‌కు నిర్మాత‌లే ఈ ఫ్లైట్ల‌ను పంపుతున్నారు. షూటింగ్‌ల‌కు ఆల‌స్యం కావ‌ద్దు, కాల్షీట్లు వృథా కావ‌ద్ద‌న్న ఉద్దేశంతో బాలీవుడ్‌లో ఈ నూత‌న సంప్ర‌దాయానికి ఏడేళ్ల క్రితం బీజం ప‌డింది. ఈ మ‌ధ్య హిందీ హీరోలు విదేశాల్లో జ‌రిగే అవార్డు ఫంక్ష‌న్ల‌కి హాజ‌రు కావాల‌న్నా.. నిర్వాహ‌కులు ప్ర‌త్యేక విమానాలు పంపుతున్నారు.
ద‌క్షిణాదిన ఇదే మొద‌లు..
బాలీవుడ్ అంటే ప్రపంచ‌వ్యాప్త మార్కెట్‌. బిజినెస్ పెద్ద‌ది. అక్క‌డ నిర్మాత‌లు షూటింగ్ కోసం ప్ర‌త్యేక విమానం పంపారంటే అందులో వింతేం లేదు. కానీ, ద‌క్షిణాదిన ఇంకా ఈ సంప్ర‌దాయం రాలేదు. ఎందుకంటే మ‌న మార్కెట్ ప‌రిమిత‌మైంది. బాలీవుడ్‌తో దీన్ని పోల్చ‌లేం. ఇప్పుడిప్పుడే బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవిలాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తున్నాయి. కానీ ర‌జినీకాంత్ సినిమాల‌ నిర్మాణ వ్య‌యం ఐదేళ్లుగా బ‌డ్జెట్ రూ.100 కోట్లు దాటుతోంది. పైగా ర‌జినీకి దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. అయినా, ఇంత‌వ‌రకు ర‌జినీ కాంతే ప్ర‌త్యేక విమానంలో తిర‌గ‌లేదు. అలాంటిది ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్పుడే త‌న చార్టెడ్ ఫ్లైట్‌లో రాక‌పోకలు సాగిస్తున్నాడంటే.. ప‌వ‌న్ స్టామినా మ‌రింత పెరిగింద‌ని ఇండ‌స్ర్టీలో చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్ షూటింగ్‌ల కోసం ప్ర‌త్యేక విమానంలో వ‌స్తే.. అది చ‌ర్చే కాకుండాపోయేది. త‌న వ్య‌క్తిగ‌త ప‌నికి విమానం వాడటంలోనే ప‌వ‌న్ త‌న‌దైన శైలి క‌న‌బ‌రిచారని పొంగిపోతున్నారు ఆయ‌న‌ అభిమానులు, జ‌న‌సేన నేత‌లు.
Next Story