Telugu Global
Cinema & Entertainment

గంద‌ర గోళం లో సునీల్

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా మారిన సునీల్ కు ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘పూలరంగడు’ సినిమా తరువాత ఇంతవరకు ఒక్కహిట్ కూడా లేని సునీల్, హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకొని ‘కృష్ణాష్టమి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కృష్ణాష్టమి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా […]

గంద‌ర గోళం లో సునీల్
X

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా మారిన సునీల్ కు ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘పూలరంగడు’ సినిమా తరువాత ఇంతవరకు ఒక్కహిట్ కూడా లేని సునీల్, హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకొని ‘కృష్ణాష్టమి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కృష్ణాష్టమి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా కనిపించటం లేదు. సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో..’, బాలయ్య ‘డిక్టేటర్’ లాంటి బడా సినిమాలు ఉండటంతో ఆ సీజన్ లో రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని భావిస్తున్నారు కృష్ణాష్టమి యూనిట్ సభ్యులు.

ఇంకాస్త ముందుగా క్రిస్టమస్ సమయంలో రిలీజ్ చేయాలన్నా అక్కడ కూడా పోటీ తప్పేలా లేదు. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘సౌఖ్యం’ తో పాటు, చాలా రోజుల తరువాత నాగ్ హీరోగా వస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలు క్రిస్టమస్ నే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో భారీ పోటీలో బరిలోకి దిగాలా..? లేక ఇంకాస్త ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేయాలా..? అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నాడు సునీల్.

First Published:  18 Nov 2015 7:05 PM GMT
Next Story