Telugu Global
Others

వంగవీటి నష్టాన్ని... అనురాధతో పూడ్చబోయారా..?

చిత్తూరు మేయర్‌ అనురాధ హత్య జరిగిన వెంటనే టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం హత్యాస్థలిలో ఉండగానే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(కాపుసామాజికవర్గం నేత) ప్రెస్‌మీట్ పెట్టి హత్య వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ నేత సీకే బాబు హత్య చేయించారని చెప్పారు. టీడీపీ నేతలు ఇలా వెంటనే ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని వైసీపీ నేతలంటున్నారు. కాపునాయకుడు వంగవీటి రంగా […]

వంగవీటి నష్టాన్ని... అనురాధతో పూడ్చబోయారా..?
X

చిత్తూరు మేయర్‌ అనురాధ హత్య జరిగిన వెంటనే టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం హత్యాస్థలిలో ఉండగానే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(కాపుసామాజికవర్గం నేత) ప్రెస్‌మీట్ పెట్టి హత్య వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ నేత సీకే బాబు హత్య చేయించారని చెప్పారు. టీడీపీ నేతలు ఇలా వెంటనే ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని వైసీపీ నేతలంటున్నారు.

కాపునాయకుడు వంగవీటి రంగా హత్య చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని ఇటీవల తన పుస్తకంలో సీనియర్ నేత హరిరామజోగయ్య బయటపెట్టారు. దీంతో అప్పటి నుంచి కాపు యువతలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ మీడియా కూడా రంగాహత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న కోణాన్ని బాగా ప్రచారం చేసింది. జోగయ్య పుస్తకం తర్వాత కోస్తాలో కమ్మ, కాపు సామాజికవర్గం మధ్య గ్యాప్ వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఇంతలోనే చిత్తూరులో అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌పై దాడి జరిగింది. దీన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ వాళ్ల లాజిక్ ఏమంటే…

హత్యకు గురైన అనురాధ కుటుంబం కాపు సామాజికవర్గానికి చెందినది. స్థానికంగా వీరికి ప్రత్యర్థిగా ఉన్న సీకే బాబు … రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. పైగా జగన్‌ పార్టీలో ఉన్నారు. ఈ సమయంలో ఒకవేళ సీకే బాబే హత్య చేయించి ఉంటే… కాపు నేతల ఎదుగుదలను చూడలేక జగనే ఈ హత్యలు చేయించారని టీడీపీ నేతలు ప్రచారం చేసేవారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అలా ప్రచారం చేయడం ద్వారా ఏకకాలంలో కాపులను దువ్వినట్టు అవుతుంది… జగన్‌పై కాపుల్లో వ్యతిరేకత సృష్టించినట్టు అవుతుందని టీడీపీ నేతలు ప్లాన్ చేశారని చెబుతున్నారు. అయితే తీరా హత్య చేయించింది అనురాధ బంధువేనని తేలడంతో టీడీపీ నేతల వ్యూహం బెడిసి కొట్టిందని వైసీపీ నాయకులంటున్నారు. మొత్తం మీద హరిరామజోగయ్య పుస్తకం వల్ల జరిగిన నష్టాన్ని… అనురాధను హత్య చేయించింది జగన్‌ బ్యాచేనని ప్రచారం చేయడం ద్వారా పూడ్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే హత్య చేసింది అనురాధ బంధువేనని పూర్తిగా తేలిపోవడంతో, ఆ నేరాన్నివైసీపీ మీద రుద్దాలని ప్రయత్నించిన టీడీపీ పరువు పోగొట్టుకోవడంతో ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగింది. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో హత్య చేసిన అనురాధ బందువు వెనుక సీకే బాబు హస్తం ఉందా అంటూ అనుమానాలు రేపే ప్రయత్నం జరిగింది.

First Published:  18 Nov 2015 9:33 AM GMT
Next Story