Telugu Global
Cinema & Entertainment

సింగ‌ర్  సునీత‌లో కొత్త కోణం

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో…’ అంటూ ‘గులాబి’లో గుబాళించిన సునీత గానం ఈ నాటికీ జనాన్ని పరవశింపచేస్తూనే ఉంది… తన పాటల పల్లకిలో జనాన్ని ఊరేగించడమే కాదు, బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ ఎంతగానో మురిపించింది సునీత… అదలా ఉంచితే సునీతలో మనకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి… స్వతహాగా హాస్యప్రియురాలయిన సునీత ఈ మధ్య తనకు నచ్చిన అంశాలలో నటించేస్తూ వాటిని పోస్ట్ చేస్తూ జనానికి కితకితలు పెడుతోంది… అలా హాస్య నటి […]

సింగ‌ర్  సునీత‌లో కొత్త కోణం
X

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో…’ అంటూ ‘గులాబి’లో గుబాళించిన సునీత గానం ఈ నాటికీ జనాన్ని పరవశింపచేస్తూనే ఉంది… తన పాటల పల్లకిలో జనాన్ని ఊరేగించడమే కాదు, బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ ఎంతగానో మురిపించింది సునీత… అదలా ఉంచితే సునీతలో మనకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి… స్వతహాగా హాస్యప్రియురాలయిన సునీత ఈ మధ్య తనకు నచ్చిన అంశాలలో నటించేస్తూ వాటిని పోస్ట్ చేస్తూ జనానికి కితకితలు పెడుతోంది… అలా హాస్య నటి కోవై సరళ రీతిలో ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన సునీత మెదడులో మెదలవగానే దానిని ఆచరణలో పెట్టింది… తత్ఫలితంగానే కోవై సరళను అనుకరిస్తూ సునీత చేసిన డబ్ స్మాష్ నెట్‌లో ప్రత్యక్షమయింది…

క్షేమంగా వెళ్ళి లాభంగా రండి- సినిమా చూసినవారికి అందులో బ్రహ్మానందం, కోవై సరళ జంట కురిపించిన హాస్యం గుర్తుండే ఉంటుంది… ఆ సినిమాలోని బ్రహ్మి, కోవై మధ్య సాగే సీన్స్ చూస్తే ఈ నాటికీ గిలిగింతలు మొదలవుతాయి… అంతలా నవ్వించిన ఆ జంట నటించిన సన్నివేశానికి సునీత, మరో నటుడితో కలసి చేసిన డబ్ స్మాష్ ఇప్పుడు యూ ట్యూబ్ లో మురిపిస్తోంది… ఈ క్లిప్ కు భలేగా క్లిక్కులు లభిస్తున్నాయి… జనం ఈ క్లిప్ చూసి నవ్వుల్లో తేలిపోతున్నారు… నిజానికి సింగర్ సునీతలో ఈ యాంగిల్ కూడా ఉందని ఆశ్చర్యం వేయకమానదు… మరి సునీత మునుముందు మరెంతగా మురిపిస్తుందో చూడాలి…

First Published:  17 Nov 2015 7:08 PM GMT
Next Story